హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం స్కాంపై ఛార్జీషీట్: రామలింగ రాజు సహా 47మంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Satyam scam: ED files chargesheet
హైదరాబాద్: సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) సోమవారం నాంపల్లి ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో రామలింగ రాజు సహా 47మంది వ్యక్తులు, 157 సంస్థల పేర్లను ఈడి ఛార్జీషీటులో పేర్కొంది.

సత్యం కుంభకోణంపై ఈడి 2009లో కేసు నమోదు చేసింది సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసును నమోదు చేసింది. ఇప్పుడు దర్యాఫ్తును పూర్తి చేసింది. సత్యం దివాళాపై పూర్తి స్థాయి విచారణను జరిపిన ఈడి ఛార్జీషీట్ దాఖలు చేసింది. రామలింగ రాజు, రామరాజు సహా పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లను పేర్కొంది.

కాగా, సత్యం కుంభకోణానికి సంబంధించి కేసులో సత్యం కంపెనీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పోయిన ఏడాది డిసెంబర్‌లో ఊరట లభించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తుల జఫ్తునకు సంబంధించి ఈడి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అప్పుడు స్టే విధించింది.

సత్యం కేసులో ఈడి రూ.822 కోట్ల విలువైన ఆస్తులను నాడు జఫ్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు ఈడి ఆదేశాలను నిలుపుదల చేసింది.

English summary
Enforcement Directorate(ED) had filed chargesheet against Satyam scam case on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X