వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుల ఖర్చులు సౌదీ భరిస్తుంది: సుష్మా స్వరాజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువస్తామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. గురువారం సుష్మా స్వరాజ్ రాజ్యసభలో మాట్లాడారు.

రెండు రోజుల్లో భారతీయుల సమస్యలు పరిష్కరించాలని సౌదీ రాజు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సుష్మా స్వరాజ్ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వీలుగా ఎగ్జిట్ వీసాలు అవసరం అన్నారు.

 Sushma

ఎగ్జిట్ వీసాలు ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి పంపడానికి అయ్యే ఖర్చు సౌదీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను ఆదుకోవడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం సిద్దం అయ్యిందని అన్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను దేశంలో ఇతర కంపెనీల్లో చేర్చుకోవడానికి సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సుష్మా స్వరాజ్ వివరించారు. భారతీయులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె రాజ్యసభలో చెప్పారు.

శిబిరాల్లో తలదాచుకున్న భారత కార్మికులకు ఆహారం, వసతి కల్పిస్తున్నామని, వైద్యం అందిస్తున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పిందని ఇదే సందర్బంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు.

English summary
Saudi Arabia has said that exit visas will be given as asked by India for Indian workers there. Saudi Arabia has informed that the process of sending back workers to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X