వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ రాజు ఆగ్రహం: వెలుగులోకి యువరాజు అరాచకాలు(వీడియో)

సౌదీలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఎలాగంటే.. పలువురిపై దాడికి పాల్పడిన వీడియోలు వెలుగుచూడటంతో సౌదీ రాకుమారునిపై ఆ దేశ రాజు సల్మాన్ ఆగ్రహం.

|
Google Oneindia TeluguNews

సౌదీఅరేబియా: సౌదీలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఎలాగంటే.. పలువురిపై దాడికి పాల్పడిన వీడియోలు వెలుగుచూడటంతో సౌదీ రాకుమారునిపై ఆ దేశ రాజు సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని, అతని అనుచరులని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే.. సౌదీ ప్రిన్స్‌ సాద్‌ బిన్‌ అబ్దులాజిజ్‌.. స్థానిక పౌరుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ మనిషికి తుపాకీ ఎక్కుపెట్టి బెదిరిస్తునట్లు ఆ వీడియోలో ఉంది. మరో వీడియోలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టినట్లు ఉంది. అంతేగాక, కొన్ని వీడియోల్లో పలు మద్యం బాటిళ్లు కూడా దర్శనమిచ్చాయి. ఆ దేశంలో ప్రస్తుతం మద్యపాన నిషేధం అమలులో ఉంది.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై సౌదీ రాజు సల్మాన్‌ తీవ్రంగా స్పందించారు. వెంటనే ప్రిన్స్‌ని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దేశ ప్రజల ప్రయోజనాలకంటే రాజకుటుంబ ప్రయోజనాలు ముఖ్యం కావని సల్మాన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేగాక, వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపినందుకు 2013 అక్టోబర్‌లో ఓ సౌదీ ప్రిన్స్‌ను ఉరితీసిన విషయం తెలిసిందే.

English summary
A Saudi prince has been arrested after a video emerged online purporting to show him abusing someone and pointing a rifle at another.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X