వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో అనుబంధం మా డీఎన్ఏలోనే ఉంది: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకున్న సల్మాన్‌కు పాలెం విమానాశ్రయంలో ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. భారత్‌కు రాకమునుపు సల్మాన్ ఇస్లామాబాద్‌ పర్యటనకు వెళ్లారు. అయితే నేరుగా అక్కడి నుంచి భారత్‌కు ఆదివారమే రావాల్సి ఉండగా భారత్‌ కొన్ని దౌత్యపరమైన అడ్డంకులు చెప్పడంతో ఆయన తిరిగి సౌదీకి చేరుకున్నారు. అనంతరం మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు.

ఇక బుధవారం ఉదయం సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనక గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోడీ సౌదీ రాజుతో హైదరాబాద్ హౌజ్‌లో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ప్రేమవిందును ప్రధాని ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా మహ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చలు జరుపుతారు.

Saudi Prince in Delhi:All eyes on Pak mention in joint statement

రాష్ట్రపతి భవన్‌లో గార్డ్ ఆఫ్ హానర్ పొందిన తర్వాత సౌదీరాజు మహ్మద్ బిన్ సల్మాన్... తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య బంధం తమ డీఎన్ఏలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల అభివృద్ధి కోసం భారత్ సౌదీల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చనే నమ్మకం తనకుందని చెప్పారు సల్మాన్.

Saudi Prince in Delhi:All eyes on Pak mention in joint statement

ఇదిలా ఉంటే సౌదీ రాజు సల్మాన్ పర్యటనను పుల్వామా ఉగ్రదాడుల ఘటనతో చూడరాదని భారత్‌లో సౌదీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ తెలిపారు. భారత్ సౌదీ అరేబియా దేశాల మధ్య బంధం ఇప్పటిది కాదని.. మున్ముందు కూడా మంచి సంబంధాలు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ మరియు ఆర్థిక అంశాలపై ఇరు దేశాలకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

English summary
saudi Arabia's Crown Prince Mohammed bin Salman has been accorded the ceremonial reception with a guard of honour at the Rashtrapati Bhavan, where he was received by President Ram Nath Kovind and Prime Minister Narendra Modi. The prince, MBS as he is popularly known, will meet Modi later today, with his business mission under threat of being overshadowed by soaring tensions between India and Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X