వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త నిబంధనలు: SBI అకౌంట్ ఇకపై క్యాష్ డిపాజిట్ చేయడం కుదరదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కొత్త నియమాలను ప్రవేశపెట్టిన ఎస్బీఐ...!

న్యూఢిల్లీ: ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తుండటంలో మోసాలను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఖాతాలోకి జమఅవుతున్న నగదుపై ఓ కన్నేసింది ఎస్బీఐ. డబ్బును ఒక ఖాతాలోకి వేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇందుకు సంబంధించి కొత్త నియమనిబంధనలను తీసుకురానుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తి ఖాతాలోకి డబ్బులు వేయరాదు.సొంత కుటుంబ సభ్యులైనా సరే వారి కుటుంబ సభ్యుడి ఖాతాలో డబ్బులు వేయరాదంటూ కొత్త నిబంధన తీసుకురానుంది ఎస్బీఐ. ఇది అమల్లోకి వస్తే కొన్ని లక్షల మంది ఎస్బీఐ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

<strong>వ్యవస్థలో దొంగనోట్లు చలామణి పెరిగిపోతోంది: ఆర్బీఐ రిపోర్ట్</strong>వ్యవస్థలో దొంగనోట్లు చలామణి పెరిగిపోతోంది: ఆర్బీఐ రిపోర్ట్

పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మోసపూరిత లావాదేవీలు చాలా జరిగినట్లు ఎస్బీఐ దృష్టికి రావడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.డబ్బులు ఇకపై బ్రాంచీ నుంచి మరో అకౌంట్‌కు వేయరాదు అనే నిబంధన త్వరలో రానుంది. అయితే ఇక్కడ కొంత ఊరటనిచ్చే అంశమేమిటంటే ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ కానీ, డిపాజిట్ కానీ చేసుకోవచ్చు. బ్రాంచ్‌కెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాలంటే... ఏ ఖాతాలో అయితే డబ్బులు డిపాజిట్ చేస్తున్నారో ఆ ఖాతాదారుడు క్యాష్ డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తూ ఓ లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ అప్లికేషన్ ఫామ్ నింపి బ్యాంకుకు అందజేసిన తర్వాత ఆ సంబంధిత ఖాతాలోకి ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేసే అవకాశముంటుంది.

SBI changes rules, will not be able deposit cash in others’ account soon

పెద్ద నోట్ల రద్దు సమయంలో చాలా వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్బీఐ వెల్లడించింది. ఖాతాదారుడి అనుమతి లేకుండానే డబ్బులు వారి అకౌంట్లో డిపాజిట్ అయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎస్బీఐ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.

English summary
In a bid to curb fraudulent transactions, the State Bank of India (SBI) has made certain changes in the rules governing cash deposit into accounts. As per a new rule, one will not be able to deposit cash into another person’s account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X