వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌బీఐ ఖాతాదారులకు వూరట, ఆ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోయినా చార్జీ ఉండదు, కావాలంటే మార్చుకోండి

కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో ఎస్‌బీఐ స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన, చిన్న పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్‌ ఖాతాలకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదని తెలిపింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై), చిన్న పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్‌ ఖాతా(బీఎస్‌బీడీ)లకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదని తెలిపింది.

కనీస నిల్వ లేకపోయినా, ఈ ఖాతాల నుంచి ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని పేర్కొంది. మొత్తం ఎస్‌బీఐకు 40 కోట్ల పొదుపు ఖాతాదారులు ఉండగా, సుమారు 13 కోట్ల మంది వూరట లభించినట్లయింది.

sbi
.

అంతేకాదు, ప్రస్తుతం ఎస్‌బీఐలో పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుములు చెల్లిచకుండా తమ ఖాతాలను ప్రాథమిక పొదుపు డిపాజిట్‌ ఖాతాకు మార్చుకోవచ్చని కూడా వెల్లడించింది.

పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఛార్జీ వసూలు చేస్తుందంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

English summary
State Bank of India, the biggest lender in the country today said in a press release that the monthly average balance non-maintenance charges are not applicable on all its savings bank accounts. "Prime Minister's Jan Dhan Yojna (PMJDY), Small accounts and Basic Savings Bank Deposit (BSBD) accounts are exempted from MAB requirement and no charges are recovered from these accounts," SBI said in a press release. Out of the 40 crore savings bank accounts that SBI has, 13 crore accounts fall under these exempted category, the state-owned lender said. Those who want to avoid paying monthly average balance non-maintenance charges, they can convert their savings account to Basic Savings Bank Deposit Account without any cost, SBI further said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X