వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకింగ్‌పై మరో పిడుగు.. ఎస్‌బీఐకి రూ.411కోట్లు కుచ్చు టోపీ.. తెర పైకి కొత్త ఉదంతం..

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే పలు స్కామ్‌లు,భారీ రుణ ఎగవేతలతో కుదేలవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో మరో ఉదంతం వెలుగుచూసింది. ఢిల్లీ కేంద్రంగా బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తి కార్యకలాపాలు నిర్వహించే రామ్‌దేవ్ అంతర్జాతీయ సంస్థ ఎస్‌బీఐతో పాటు మొత్తం ఆరు బ్యాంకులకు రూ.414కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఈ సంస్థను డిఫాల్టర్ల జాబితాలో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది.

Recommended Video

Another Bank Defaulter Flees Country, Basmati Rice Exporter Defaulting On rs 411 crore Loan
విదేశాలకు చెక్కేసిన డైరెక్టర్లు..

విదేశాలకు చెక్కేసిన డైరెక్టర్లు..


కానీ ఇప్పటికే ఆ సంస్థ డైరెక్టర్లు నరేశ్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌, సంగీత విదేశాలకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ వారిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులను నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థను జనవరి 7, 2016లోనే ఎస్‌బీఐ మొండి బకాయిల జాబితాలో చేర్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ వారి ఆచూకీ లేదు. నాలుగేళ్ల తర్వాత ఎస్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేయగా.. ఏప్రిల్ 28న కేసు నమోదైంది.

ఏయే బ్యాంకు నుంచి ఎంత రుణం...

ఏయే బ్యాంకు నుంచి ఎంత రుణం...


రామ్‌దేవ్ ఇంటర్నేషనల్స్ ఎస్‌బీఐ నుండి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.76.09 కోట్లు, యూనియన్‌ బ్యాంకు నుండి రూ.64.31 కోట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి రూ.51.31 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుండి రూ. 36.91 కోట్లు, ఐడిబిఐ బ్యాంకు నుండి రూ.12.27 కోట్లు తీసుకుని రుణ ఎగవేతకు పాల్పడింది. . లిక్విడిటీ సమస్య కారణంగా ఆ సంస్థ ఖాతాలోని 173.11 కోట్లను 2016లో నిరర్థక ఆస్తులుగా మార్చినట్లు ఎస్‌బీఐ సిబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఎక్కడెక్కడ కార్యాలయాలు..

ఎక్కడెక్కడ కార్యాలయాలు..

రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ వెస్ట్ ఆసియన్,యూరోపియన్ దేశాలకు భారత్ నుంచి బాస్మతి రైస్‌ను ఎగుమతి చేస్తోంది. ఎస్‌బీఐ ఫిర్యాదు ప్రకారం.. ఆ సంస్థకు మూడు రైస్ మిల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవిగాక మరో 8 ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. హర్యానాలోని కర్నాల్ జిల్లాతో పాటు సౌదీ అరేబియా,దుబాయి‌లలో వీటి కార్యాలయాలు ఉన్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా సీబీఐ ఆ సంస్థ కార్యాలయాల్లో ఎలాంటి సోదాలు నిర్వహించలేదు. నిందితులకు త్వరలోనే సమన్లు జారీ చేస్తామని,ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే కఠిన చర్యలు ఉంటాయని సీబీఐ వెల్లడించింది.

English summary
Three promoters of Ram Dev International, recently booked by the CBI for allegedly cheating a consortium of six banks to the tune of Rs 411 crore, have already fled the country before the State Bank of India reached the agency with the complaint, officials said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X