వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్‌బీ స్కామ్: ఆ 3ఖాతాలను నిలిపేసిన ఎస్‌బిఐ, నీరవ్ కంపెనీల నుంచి ఛోక్సీకి రూ.4500కోట్లు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును నిండా ముంచిన డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోడీ కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఎస్‌బిఐలోని నీరవ్ ఖాతాలపై కూడా దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలో ఎస్‌బిఐలో నీరవ్‌కు సంబంధించిన మూడు ఓవర్సీస్ ఖాతాలను సంస్థ స్తంభింపజేసింది. ఖాతాల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించింది. ఈ మూడు ఖాతాలు దుబాయ్, బహ్రెయిన్,అంట్వెర్ప్ లలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

విచారణకు ఆ ఖాతాలతో లింకు?

విచారణకు ఆ ఖాతాలతో లింకు?

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన రూ.11వేల కుంభకోణానికి ఈ ఖాతాలకు ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. అయితే విచారణలో ఈ ఖాతాల వివరాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. కాగా, ఎస్‌బిఐకి కూడా నీరవ్ మోడీ రూ.20కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే.

నీరవ్ కంపెనీల నుంచి ఛోక్సీకి రూ.4500కోట్లు:

నీరవ్ కంపెనీల నుంచి ఛోక్సీకి రూ.4500కోట్లు:

రూ.11వేల కోట్ల కుంభకోణంలో దాదాపు రూ.4500కోట్లు మెహుల్ ఛోక్సీకి మళ్లినట్టు గుర్తించారు. నీరవ్ మోడీ, ఛోక్సీ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తాము గుర్తించామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఓవర్సీస్ ఖాతాలకు మళ్లించిన మొత్తం డబ్బుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం లేదన్నారు.

 యూఏఈ, హాంకాంగ్ కేంద్రంగా..:

యూఏఈ, హాంకాంగ్ కేంద్రంగా..:

నీరవ్ మోడీ అక్రమాలకు సంబంధించి ఇప్పటిదాకా గుర్తించిన సాక్ష్యాధారాలన్నింటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందజేసినట్టు తెలిపారు. అక్రమ ఎల్‌ఓయూలను సృష్టించి వివిధ బ్యాంకుల ద్వారా నీరవ్ నిధుల మళ్లింపు చేసినట్టు చెప్పారు. హాంకాంగ్, యూఏఈల నుంచే మోడీ, ఛోక్సీ కంపెనీల మధ్య ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు గుర్తించామన్నారు. అలాగే న్యూయార్క్ కేంద్రంగా కూడా కొన్ని నిధుల ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు.

 ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా..:

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా..:

ఇండియా మరియు విదేశాల్లో దాదాపు 120 డబ్బా కంపెనీలను సృష్టించి నీరవ్ మోడీ, ఛోక్సీ కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డాయన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలపై లోతుగా విచారిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సైతం ఈ కంపెనీల లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది.

'యునిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్'

'యునిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్'

నీరవ్ మోడీ, ఛోక్సీ కంపెనీల ఆర్ఠిక లావాదేవీలకు సంబంధించి ఆయా ఖాతాల యునిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్స్ తమకు అందించాల్సిందిగా ఆర్బీఐని కోరినట్టు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి యునిక్ రిఫరెన్స్ నంబర్స్ ఏమి తమ వద్ద లేవని ఆర్బీఐ చెప్పినట్టు తెలియజేశారు.

English summary
State Bank of India (SBI) has frozen three accounts of Nirav Modi group companies and shared the information related to those accounts with investigative agencies, bank officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X