అలర్ట్.. అలర్ట్... శనివారం ఎస్బీఐ సేవలకు బ్రేక్.. సిస్టమ్ అప్గ్రెడేషన్ వల్ల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. ఆన్ లైన్ బ్యాంకింగ్ నిర్వహిస్తోన్న వారికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. శనివారం ఆన్ లైన్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు పని చేయవని.అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గత కొంతకాలంగా టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియను ఎస్ బీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 22 వేల శాఖలు, 57 వేల 889 ఏటీఎం కేంద్రాలు దీనికి ఉన్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా అప్ గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సారి ఆ సమస్యను పూర్తిగా క్లియర్ చేయాలని అనుకుంటున్నాయి.

వాస్తవానికి అప్ గ్రేడేషన్ కంపల్సరీ. దానికి సంబంధించి ఖాతాదారులకు సమాచారం ఇస్తారు. ప్రైవేట్ బ్యాంకులు అయితే మరీ ఎక్కువ పర్యాయలు జరుగుతాయి. దేశంలో పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్.. అప్ గ్రేడేషన్ చేస్తోంది. ఖాతాదారులకు ముందుగా సమాచారం ఇవ్వడంతో ఇబ్బంది తప్పింది. ఆ సమయంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుంటే సరిపోతుంది. చేసినా.. డబ్బులు ఎటు వెళ్లవు. 3 వర్కింగ్ డేస్లో నగదు తిరిగి జమ అవుతుంది. కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు.