వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్బీఐ లో భలే ఛాన్స్! ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’అవకాశం!!

ఇంటి నుంచి పని చేయడానికి ఉద్యోగులకు వీలు కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానానికి ఎస్బీఐ బోర్డు ఈ మద్యనే ఆమోదం తెలిపింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: ఇంటి నుంచి పని చేయడానికి ఉద్యోగులకు వీలు కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మొబైల్ ను ఉపయోగించి ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కల్పించే 'వర్క్ ఫ్రం హోమ్' విధానానికి ఎస్బీఐ బోర్డు ఈ మద్యనే ఆమోదం తెలిపింది.

దీని ప్రకారం... మొబైల్ కంప్యూటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉద్యోగులందరి మొబైల్లను కేంద్రీకృత వ్యవస్థ ద్వరా నిర్వహిస్తారు. డేటా, అప్లికేషన్లకు భద్రత పరంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటారు.

SBI launches 'Work from Home' facility for employees

ఈ సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ప్రత్యేక వ్యవస్థ (ఎమ్ఐఎన్) ద్వారా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. దీనివల్ల ఉద్యోగులు సత్వరం ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఇంటి నుంచి పని ప్రదేశానికి పరుగులు పెట్టాల్సిన అవసరం రాదు. వారు ఇంట్లోంచే ఆ పనిని పూర్తి చేసేందుకు వీలవుతుంది.

భవిష్యత్తులో మార్కెటింగ్, సీఆర్ఎమ్, సోషల్ మీడియా మేనేజ్ మెంట్, సెటిల్ మెంట్, ఫిర్యాదు నిర్వహణ తదితర పనులకూ ఇంటి నుంచే పని చేసేలా వీలు కల్పించాలని స్టేట్ బ్యాంకు భావిస్తోంది. తద్వారా ఉద్యోగి ఉత్పాదకతను ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని అంటోంది.

English summary
MUMBAI: Country's largest lender State Bank of IndiaBSE 0.63 % today launched a new facility to enable its employees to work from home. The Board of the bank has recently approved the 'Work from Home' policy to enable its employees to work while at home using mobile devices to address any urgent requirement they may have, that prevents their travelling to work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X