వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త: ఎఫ్‌డీలపై వడ్డీరేటు పెంపు

|
Google Oneindia TeluguNews

ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు మరో శుభవార్త తెలియజేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఎస్బీఐ మరోసారి డిపాజిట్‌ రేట్లను పెంచేసింది. రిటైల్‌ వినియోగదారులు రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి చేసిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 నుంచి 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

అంతేగాక, ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలావధితో రూ. కోటిపైన చేసిన డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. కాగా.. బల్క్‌ డిపాజిట్‌ రేట్లను పెంచడం గత ఐదు నెలల్లో ఇది నాలుగోసారి.

 SBI Raises Interest Rates on Fixed Deposits

2-3 ఏళ్ల కాలావధి డిపాజిట్లకు వడ్డీరేటును ప్రస్తుతం ఉన్న 6.50శాతం నుంచి 6.60శాతానికి పెంచారు. 3-5 ఏళ్ల కాలావధి డిపాజిట్లకు వడ్డీరేటును 6.50శాతం నుంచి 6.70శాతానికి పెంచారు.

5-10 ఏళ్ల కాలవధి డిపాజిట్లకు వడ్డీరేటును 6.50శాతం నుంచి 6.75శాతం చేశారు. ఇక
బల్క్‌ డిపాజిట్లకు సంబంధించి రూ.1-10 కోట్ల మొత్తాలకు, 1-2 ఏళ్ల కాలావధికి ప్రస్తుతం ఉన్న 6.75శాతాన్ని 7.00శాతం పెంచారు.

English summary
The country's largest lender, State Bank of India hiked interest rates on fixed deposits across various tenures above 2 years. The term deposit rates have been increased by 10 to 25 basis points.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X