వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: నగదు బదిలీలపై ఖాతాదారులపై అదనపు భారం

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ కొత్త ఛార్జీలను ప్రకటించింది. జిఎస్‌టి నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలను ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ కొత్త ఛార్జీలను ప్రకటించింది. జిఎస్‌టి నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలను ప్రకటించింది.

రూ. 1000 లనుండి రూ. 1లక్షలకు రూ.5లతోపాటు జిఎస్‌టి ఛార్జీ, రూ.1 లక్షనుండి రూ.2 లక్షలకు రూ.15లతోపాటు జిఎస్‌టి ఛార్జీలను ఖరారుచేసింది.

ఇక బ్యాంకింగ్ సేవలకు జిఎస్‌టి 18 శాతంగా వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీలను ఎస్‌బిఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

 SBI Revises IMPS Money Transfer Charges

ఇప్పటికే అనేకరకాలుగా ఖాతాదారులపై ఎస్‌బి‌ఐ పన్నులు వసూలు చేస్తోంది. అయితే జిఎస్‌టి కారణంగా ఖాతాదారులపై భారం వేయనుంది.

ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేయడం, నెలలో ఐదుసార్లకంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దీనికితోడు జిఎస్‌టి చార్జీలను వసూలు చేయడం ఖాతాదారులకు భారంగానే మారనుంది.

English summary
SBI has revised charges on IMPS, or Immediate Payment Service, money transfer service. Giving the new IMPS rates in a post on microblogging site Twitter, India's largest bank SBI said IMPS transfers up to Rs. 1,000 will not attract any charges after the revision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X