వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ యుద్దం: నో పే టూ పేటిఎం, బడ్డీ యాప్ ను ఉపయోగించండి

పేటిఎంలోకి ఎస్ బి ఐ ద్వారా ఆన్ లైన్ నగదును డిపాజిట్ చేయకుండా ఎస్ బి ఐ నిలుపుదల చేసింది. ఎస్ బి ఐ అధికారిక యాప్ బడ్డీని ఉపయోగించాలని కోరింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి :నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.అయితే నగదు రహిత లావాదేవీల్లో ఇప్పటికే ఉన్న ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు కూడ యాప్ లను తెస్తున్నాయి.

నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలుచేస్తోన్న ప్రయత్నాలకు తోడుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీల కోసం తమ సంస్థలకు చెందిన యాప్ లను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని ఆయా బ్యాంకింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

ప్రైవేట్ సంస్థలకు చెందిన యాప్ లకు ఎస్ బి ఐ ఖాతాల నుండి డబ్బులు వెళ్ళకుండా యాప్ లో మార్పులుచేర్పులు చేశారు.నగదు రహిత లావాదుదేవీల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అగ్రస్థానంలో ఉన్న ఎస్ బి ఐ, పేటీఎం మద్య గొడవ సాగుతోంది.

sbi says no to paytm wallet, use sbi buddy app

తమ ఖాతాల నుండి పేటిఎం ఖాతాల్లో నగదు చెల్లింపులు లేకుుండా చేసింది ఎస్ బి ఐ. తమ బ్యాంకు రూపొందించిన బడ్డీ యాప్ ను ఖాతాదారులు వినియోగించుకొనేలా ఎస్ బి ఐ శ్రీకారం చుట్టింది.
ఎస్ బి ఐ ఆన్ లైన్ ద్వారా పేటిఎంలోకి డబ్బులు పంపడాన్ని రద్దుచేసింది. ఈ మేరకు ఎస్ బి ఐ అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. ఈ మేరకు ఖాతాదారులు ఎస్ బి ఐ అధికారిక బడ్డీ యాప్ ను ఉపయోగించాలని కోరింది .

నగదు రహిత లావాదేవీల నిర్వహణ ద్వారా ప్రైవేట్ సంస్థలు కొన్ని బాగా లాభాలను ఆర్జిస్తున్నాయి. అయితే ప్రభుత్వ రంగసంస్థలకు చెందిన బ్యాంకులు కూడ తాము రూపొందించిన యాప్ లను విస్తృతంగా వాడేలా చేయడం ద్వారా తమ వ్యాపారాన్ని మరింత విస్తృతపర్చుకొనే అవకాశం ఉందని భావించి ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది ఎస్ బి ఐ.

ఎస్ బి ఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేటిఎం లోకి డబ్బులు జమ చేసే విధానాన్ని నిలిపివేశాం. ఎస్ బి ఐ అధికారిక యాప్ బడ్డీని వాడాలని సిఫారసు చేస్తున్నామని ఎస్ బి ఐ తన అధికారికంగా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.పేటిఎం వినియోగం పెరగడం వల్ల బ్యాంకుల సర్వర్లపై ప్రభావం పడుతోందనే అభిప్రాయం కూడ ఉంది.

పేటిఎంలోకి ఆన్ లైన్ లో డబ్బులను జమ చేయాలంటే ఆయా బ్యాంకుల సర్వర్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పేటిఎం వినియోగదారులు భారీగా పెరగడంతో ఈ మేరకు బ్యాంకుల సర్వర్లపై భారం పెరుగుతోందనే కొందరు బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ బి ఐ నుండి పేటిఎంలోకి నగదును జమ చేయడాన్ని రద్దుచేశారు.అయితే మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడ ఇదే తరహలో వ్యవహరిస్తాయా లేదా చూడాలి.

English summary
sbi has said no to the payt wallet, people using sbi's internet banking can no longer transfer money to their paytm wallets.instead it recommenads its user to us sbi buddy mobile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X