వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:పారికర్ సిఎం గా ప్రమాణంపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ను గవర్నర్ ను ఆహ్వనించడంపై కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింద

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ను గవర్నర్ ఆహ్వనించడంపై కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అత్యవసరంగా ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకుగాను మ్యాజిక్ ఫిగర్ కు దూరంగానే కాంగ్రెస్ ఉంది.అయితే బిజెపి నాయకులు ఇతర పార్టీల నాయకుల మద్దతు తీసుకొంది .

గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ కు 17 స్థానాలు, బిజెపికి 13 స్థానాలు వచ్చాయి.ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి దూరంగా నిలిచింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే బిజెపి వ్యూహత్మకంగా వ్యవహరించింది.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి పారికర్ తో రాజీనామా చేయించి గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపింది బిజెపి.పారికర్ ను స్వతంత్ర ఎమ్యెల్యేలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.

manohar parikar

ముఖ్యమంత్రిగా పారికర్ ను ప్రమాణస్వీకారం చేయాలని గవర్నర్ ఆహ్వనించారు.అయితే దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలస్యంగా మేల్కొన్నారు.మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రిగా పారికర్ నియమకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. సమయం లేకపోవడంతో కాంగ్రెస్ పిటిషన్ ను వెంటనే విచారించేందుకుగాను సుప్రీం కోర్టు సైతం అంగీకరించింది.

English summary
As Goa Governor Mridula Sinha cleared the decks for Defence Minister Manohar Parrikar to form government in the state, the Supreme Court on Monday agreed to urgently hear Congress’ petition challenging his appointment as the Chief Minister of the state, news agency ANI reported. Congress is also expected to raise the issue of government formation in Goa and Manipur in Parliament tomorrow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X