వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాసన్ ప్రెసిడెంట్‌గా బాధ్యత చేపట్టొచ్చు కానీ: సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిసిసిఐ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన ఎన్ శ్రీనివాస్‌కు బాధ్యతలు చేపట్టేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టవచ్చునని సుప్రీం తెలిపింది. అయితే ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎలాంటి జోక్యం చోసుకోవద్దని సూచించింది.

ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ఈ కమిటీ విచారణ జరపనుంది. ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో జోక్యం చేసుకోమని కోర్టు తెలిపింది. విచారణ జరిపి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

N Srinivasan

సుప్రీం కోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సభ్యుల కమిటీకి పంజాబ్, హర్యానాల మాజీ న్యాయమూర్తి హెచ్‌సి ముకుల్ ముద్గల్ నేతృత్వం వహిస్తారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఎల్ నాగేశ్వర రావు, నీలేష్ దత్తా సభ్యులుగా ఉంటారు.

కాగా, శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి వీలులేదని బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశం శ్రీనివాసన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

English summary
Supreme Court allowed N Srinivasan to take charge as BCCI president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X