వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలింగ్ సమయం మార్పుపై నిర్ణయం చెప్పండి : సుప్రీంకోర్టు
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో మార్పు చేయాలన్న పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ స్పందన కోరింది. పోలింగ్ సమయంలో మార్పు చేసే విషయంలో నిర్ణయం ప్రకటించాలని ఈసీని ఆదేశించింది.
రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో మిగిలిన మూడు దశల్లో పోలింగ్‌ను ముందుగానే ప్రారంభించి సా.5గం.ల కల్లా ముగించాలని పలు పిటీషన్లు దాఖలయ్యాయి. రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పుల దృష్ట్యా ప్రజలుఎదుర్కొనే ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆదివారం నుంచి రంజాన్ మాత్రం ప్రారంభంకానుండగా.. ఈ నెల 6, 12,19 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?
