• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పశువులా కట్టేశారు: సీజేఐ రమణ బెంచ్ కీలక ఉత్తర్వులు -సిద్ధిక్‌ కప్పన్‌ భార్య పిటిషన్‌పై విచారణ -ఉత్కంఠ

|

చట్టవ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై జైలుపాలైన కేరళ జర్నలిస్టు సిద్ధిక్‌ కప్పన్‌ ఆరోగ్య పరిస్థితి, కొవిడ్ బారిన పడ్డ ఆయనను మథురలోని ఆస్పత్రిలో పశువులా కట్టేసి ఉంచారన్న వివాదంపై సుప్రీంకోర్టు దృష్టిసారించింది. తన భర్త జీవితం ప్రమాదంలో ఉందని, కనీసం కాళ్లూ చేతులకు చైన్లయినా తొలగించేలా ఆదేశాలివ్వండంటూ సిద్దిక్ భార్య రైహంత్‌ కప్పన్‌ రాసిన లేఖపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఈ మేరకు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు..

జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులుజగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులు

ఏపీలో ఇక ఆ ఆస్పత్రులన్నీ కరోనాకే -భవంతుల్లేకుంటే కాలేజీల్లో -104 ద్వారా గంటల్లో బెడ్లు: సీఎం జగన్ఏపీలో ఇక ఆ ఆస్పత్రులన్నీ కరోనాకే -భవంతుల్లేకుంటే కాలేజీల్లో -104 ద్వారా గంటల్లో బెడ్లు: సీఎం జగన్

పశువులా చైన్లతో కట్టేశారు..

పశువులా చైన్లతో కట్టేశారు..

గతేడాది అక్టోబర్ లో హాత్రస్ అత్యాచార ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ ను యూపీ సర్కారు అదుపులోకి తీసుకుని, యూఏపీఏ వంటి కఠిన చట్టాల కింద కేసులు పెట్టడం తెలిసిందే. సుదీర్ఘకాలంగా జైలులో ఉంటోన్న ఆయనకు ఇటీవల కరోనా సోకగా, మథురలోని మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో ఆయన్ను ఒక మంచంపై జంతువును కట్టేసినట్లు కట్టేశారని, కనీసం టాయిలెట్ కు కూడా వెళ్లనీయకుండా ప్లాస్టిక్ డబ్బాలోనే మూత్రం పోయిస్తున్నారని, సరైన ఆహారం కూడా లేదని, ఈ నేపథ్యంలో తాత్కాలిక ఉపశమనంగా సిద్దికి కప్పన్ కు చైన్లు తొలగించి, తిరిగి మథుర జైలుకు పంపాలని లేకపోతే కప్పన్‌ అకాల మరణానికి దారితీస్తుందని పేర్కొంటూ ఆయన భార్య రైహంత్‌ కప్పన్‌ ఆదివారం నాడు సీజేఐ రమణకు ఓ లేఖ రాశాను. దానికి అనుగుణంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి..

యోగి సర్కారుకు సుప్రీం నోటీసులు

యోగి సర్కారుకు సుప్రీం నోటీసులు

కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం నుంచి విచారిస్తామని సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, మథురలోని ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతోన్న కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సాయంత్రంలోగా రిపోర్టులు ఇవ్వాలని, ఆ కాపీలను జడ్జిలకేకాకుండా కప్పన్ కుటుంబీకులు, లాయర్లకు కూడా అందజేయాలంటూ యూపీ సర్కారుకు సుప్రీం నోటీసులిచ్చింది. సిద్దిక్ వివాదంలో కేరళ జర్నలిస్టు యూనియన్ వేసిన కార్పస్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా, కొత్తగా రైహంత్‌ కప్పన్‌ వేసిన పిటిషన్ అసలు విచారణకు అర్హమే కాదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను సుప్రీం తోసిపుచ్చింది.

కోర్టు చెబితేనే బంధించి ఉంచారు..

కోర్టు చెబితేనే బంధించి ఉంచారు..

జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ సందర్భంగా యూపీ సర్కారు తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. కప్పన్ సాధారణ నిందితుడు కాదని, కఠినమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టయ్యాడని, గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఆయనను నిర్బంధించామని, దీన్ని అక్రమనిర్బంధంగా చూడటానికి వీల్లేదని మెహతా వాదించారు. కొత్త పిటిషన్ల ద్వారా కప్పన్ తరఫు లాయర్ కేసులో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, కార్పస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని తాము కోరడంలేదని, ముందు కప్పన్ కాళ్లూ చేతులకు వేసిన సంకెళ్లను తొలగించి, ప్రాణాపాయం నుంచి కాపాడాలని మాత్రమే కోరుతున్నామని రైహంత్‌ కప్పన్‌ తరపున న్యాయవాది విల్స్‌ మాథ్యూస్‌ కోర్టుకు విన్నవించారు. బుధవారం సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. సిద్దిక్ కప్పన్ ట్రీట్మెంట్ పై కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ కూడా రాశారు.

English summary
The Supreme Court Tuesday summoned medical reports of arrested journalist Siddiqui Kappan, who has been undergoing treatment in a Mathura hospital since testing positive for Covid on 21 April. A bench led by Chief Justice of India (CJI) N.V. Ramana issued the directions to the Uttar Pradesh government and said it will hear on Wednesday Kappan’s wife’s plea to “unchain” him and move him back to the Mathura jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X