• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహా డ్రామాపై సుప్రీంకోర్టు ట్విస్ట్ -మంత్రిపై ఆరోపణలు తీవ్రమైనవే, కానీ పరంబీర్ పిటిషన్‌ విచారణకు నో

|

ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంబానీ 'బాంబు' కేసు, హిరేన్ హత్య కేసు, ఆ రెండిటిలో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే వ్యవహారం, హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెబితేనే వాజే అక్రమాలకు పాల్పడ్డాడని ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దరిమిలా మహారాష్ట్రలో గడిచిన మూడు వారాలుగా హైడ్రామా కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.

 షాక్: వైఎస్‌ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం -క్రికెట్ బ్యాట్‌తో చావబాదిన అల్లుడు - కూతురు ఫిర్యాదుతో షాక్: వైఎస్‌ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం -క్రికెట్ బ్యాట్‌తో చావబాదిన అల్లుడు - కూతురు ఫిర్యాదుతో

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు పెట్టిన మాజీ పోలీస్ సచిన్ వాజేను వాడుకుంటూ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ భారీ వసూళ్లకు పాల్పడ్డారని, పోలీసుల బదిలీలోనూ అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

 SC calls allegations by Param Bir Singh serious but refuses to hear plea; Approach HC

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరంబీర్ సింగ్ పిటిషన్ ను పరిశీలించి, దానిని విచారించలేమని స్పష్టం చేసింది. సుప్రీం వద్దకు రావడానికి ముందుగా పిటిషనర్ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో పరంబీర్ సింగ్ తన పిటిషన్ ను వెనక్కి తీసుకుని, బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే,

పిటిషన్ ను విచారణకు స్వీకరించాలా, వద్దా అనే అంశంపై వాదనలు విన్న సుప్రీం బెంచ్.. సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు తీవ్రమైనవేనని. పోలీస్ శాఖలో సంస్కరణు గతి తప్పినట్లుగా కనిపిస్తున్నదని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సుప్రీం జడ్జిలు అన్నారు.

 ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

ముంబై నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి తనను బదిలీ చేయడం చట్టవిరుద్ధమని, నిరంకుశత్వమని పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని, అదే సమయంలో మహారాష్ట్ర హోం మంత్రిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అంబానీ బాంబు కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ వాజే ద్వారా నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసేందుకు మంత్రి దేశ్‌ముఖ్ ఆదేశాలిచ్చారని పంరబీర్ ఆరోపించారు. దేశ్ ముఖ్ ఎన్సీపీ నేత కావడంతో మమారాష్ట్ర కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. పరంబీర్ వెనుక బీజేపీ హస్తం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది.

English summary
The Supreme Court on Wednesday said that the allegations levelled by former Mumbai Police Commissioner Param Bir Singh on Home Minister Anil Deshmukh were serious, but refused to entertain the plea. directed him to take the matter to the Bombay high court. Singh has sought CBI investigation in the alleged corrupt malpractices of the Maharashtra Home Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X