వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ కేసు : చోరీచేసిన దస్త్రాలను సుప్రీంకోర్టు సాక్ష్యాలుగా పరిగణిస్తోందా ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవకతవకలు జరిగాయని అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

SC decide today if stolen papers can be used as evidence

సాక్ష్యాలుగా పరిగణిస్తారా ?
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషనర్లు సమాచారం పొంది .. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్రం రివ్యూ పిటిషన్ వేసి .. తన వాదనను వినిపించింది. పిటిషనర్లు జతచేసిన దస్త్రాలు జాతీయ భద్రతా సమాచారానికి సంబంధించినదని ... వీటిని ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ చూడరాదని ఇదివరకు పేర్కొన్నది. అంతేకాదు వీటి ఆధారంగా కేసులను కూడా పరిశీలించరాదని, అధికార రహస్యాల చట్టం కింద వాటిని బహిర్గత చేయడం, ప్రచురించడం నేరమని తెలిపింది. గత నెల 24న వాదోపవాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 10 వెలువరిస్తామని స్పష్టంచేసింది.

ఏం చెబుతుందో ?
మరో 24 గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా .. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ సమాచార హక్కు చట్టం కింద జతచేసిన పత్రాలను కోర్టు అంగీకరిస్తోందా ? లేదా ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తోందా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

English summary
The Supreme Court will Wednesday pronounce verdict on the preliminary objections raised by the Centre that the documents on which it was claiming "privilege" cannot be relied upon to re-examine the verdict in the Rafale fighter jet deal with France. A bench headed by Chief Justice Ranjan Gogoi will pronounce the verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X