• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హార్దిక్ పటేల్‌కు బిగ్ షాక్..! సుప్రీం తీర్పుతో ఎంపీ బరిలో లేనట్లే?

|

ఢిల్లీ : పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు కాలం కలిసిరావడం లేదు. లోక్‌సభ బరిలో తలపడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని జామ్ నగర్ టికెట్ తెచ్చుకున్నప్పటికీ.. హార్దిక్ పటేల్ పోటీలో నిలిచే అవకాశాలు తక్కువే. విస్‌నగర్ అల్లర్ల కేసులో కింది కోర్టులు తనను దోషిగా పేర్కొనడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సత్వర విచారణ చేపట్టడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడంతో.. ఈసారి ఎన్నికల్లో హార్దిక్ పటేల్ ఎంట్రీ లేనట్లే కనిపిస్తోంది.

కల్వకుర్తిలో కల్వకుర్తిలో "గులాబీ నేతల లొల్లి"!.. ప్రచారంలో ఫైటింగ్.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ

హైకోర్టులో నిరాశ..!

హైకోర్టులో నిరాశ..!

23 ఏళ్ల వయసులో పటీదార్ ఉద్యమానికి నేతృత్వం వహించి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు హార్దిక్ పటేల్. విద్య, ఉద్యోగాల్లో పటేల్ వర్గీయులకు రిజర్వేషన్లు కల్పించాలని కొట్లాడారు. 2015లో చేపట్టిన ఆందోళన కారణంగా అల్లర్లు జరిగాయి. ఆ క్రమంలో హార్దిక్ పటేల్ పై కేసులు నమోదయ్యాయి. అల్లర్లకు ఆయనే బాధ్యుడంటూ విస్‌నగర్ సెషన్స్ కోర్టు.. 2018, జులైలో రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ క్రమంలో సెషన్స్ కోర్టు జడ్జిమెంటును సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కారు. విచారణ చేసిన న్యాయస్థానం 2018 ఆగస్టులో రెండేళ్ల జైలుశిక్షను రద్దుచేసింది గానీ.. సెషన్స్‌ కోర్టు హార్దిక్‌ పటేల్ ను దోషిగా తేల్చడంపై స్టే ఇవ్వలేదు.

 హార్ధిక్ అభ్యర్థన తిరస్కరణ

హార్ధిక్ అభ్యర్థన తిరస్కరణ

సెషన్స్ కోర్టు తనను దోషిగా తేల్చడంపై న్యాయపోరాటం చేస్తున్నారు హార్దిక్ పటేల్. ఆ క్రమంలో సెషన్స్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆయన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టు గడప తొక్కారు. అక్కడ కూడా ఆయన అనుకున్నట్లు జరగలేదు. సత్వర విచారణ చేపట్టాలన్న హార్దిక్ పటేల్ అభ్యర్థనను తోసిపుచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. 8 నెలల కిందటనే గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పిన క్రమంలో.. ఈ కేసును ఇప్పటికిప్పుడు విచారించి తీర్పు చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!

అంతా సిద్ధం.. కోర్టు తీర్పేమో అలా..!

అంతా సిద్ధం.. కోర్టు తీర్పేమో అలా..!

పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమంతో చిన్న వయసులోనే లీడర్ గా ఎదిగారు హార్దిక్ పటేల్. ఇప్పుడాయన వయసు 26 ఏళ్లు. ఇటీవలే తన చిననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన హార్దిక్ పటేల్.. రాజకీయాల వైపు దృష్టి సారించారు.
లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన.. గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ఎంపీగా పోటీచేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.

చివరి తేదీ 4.. నామినేషన్ పరిస్థితేంటి?

చివరి తేదీ 4.. నామినేషన్ పరిస్థితేంటి?

ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. సుప్రీంకోర్టు తీర్పు ఆయనకు ఊహించని పరిణామమే. ఆయన ఎన్నికల బరిలో నిలవాలంటే తనను దోషిగా నిర్ధారించిన కేసులో న్యాయస్థానం స్టే ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ కు మరో 2 రోజుల మాత్రమే గడువు ఉండటంతో.. ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమైంది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అయిన 4వ తేదీలోపు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

English summary
Patidar leader Hardik Patel has been refused an urgent hearing in the Supreme Court on his request to hold his conviction so he can contest this month's polls. "What's the urgency now," the top court asked, pointing out that the conviction dated to 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X