వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆధార్ లింకింగ్‌పై మధ్యంతర ఉత్తర్వులు: సుప్రీంలో పెద్ద ఊరట
న్యూఢిల్లీ: వివిధ సంక్షేమ పథకాలతో పాటు, ఇతర సేవల కోసం ఆధార్ లింకింగ్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో అందరికి భారీ ఊరట లభించింది.
ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువును మార్చి 31, 2018 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అన్ని సేవలకు ఆధార్ నెంబర్ అనుసంధాన గడువును మార్చి 31వ తేదీకి పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఆధార్ చట్టం చట్టబద్దత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల బెంచ్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.