వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ ఏడాది ఆగష్టు 31 వరకు సమయం పొడిగిస్తూ అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసును విచారణ చేస్తున్న న్యాయమూర్తి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలని వెల్లడించింది. ఇక ఈ కేసులో మొత్తం 32 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో బీజేపీ వృద్ధుడు మాజీ కేంద్రమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి, ప్రస్తుత ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మరియు సాక్షి మహారాజ్‌లు ఉన్నారు.

మసీదు నిర్మాణంకు భూమి కేటాయించిన యోగీ సర్కార్.. మళ్లీ సుప్రీంకు బాబ్రీ లిటిగెంట్లుమసీదు నిర్మాణంకు భూమి కేటాయించిన యోగీ సర్కార్.. మళ్లీ సుప్రీంకు బాబ్రీ లిటిగెంట్లు

1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చడం జరిగింది. ఆ తర్వాత అయోధ్యలో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి బాబ్రీ మసీదు కూల్చడంలో కుట్రకోణం దాగి ఉందని, రెండోది బాబ్రీ మసీదును కూల్చాల్సిందిగా ప్రజలను రెచ్చగొట్టారని చెబుతూ కేసు నమోదైంది. దీంతో పాటుగా మరో 47 కేసులు నమోదు కాగా వాటన్నిటినీ కూల్చివేత కేసుతోనే జతచేశారు. అయితే రెండు కేసుల్లో వేర్వేరుగా విచారణ చేయడం జరిగింది. లక్నోలో బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరుగుగా.... ప్రజలను రెచ్చగొట్టిన కేసు విచారణ రాయ్‌బరేలీ కోర్టులో జరుగుతోంది.

SC extends the deadline for CBI court to deliver verdict on Babri Masjid demolition

ఇక లక్నో కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న 22 మందిలో ఒకరు మృతి చెందారు. ఇక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా 21 మందిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరిలో పవన్ పాండే, బ్రిజ్ భూషణ్ సింగ్, ఆర్ఎన్ శ్రీవాస్తవా, లల్లూ సింగ్, సాక్షి మహరాజ్‌లు ఉన్నారు. అయితే ఆర్ఎన్ శ్రీవాస్తవ ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉండేవారు. ఇక రాయ్‌బరేలీ కోర్టులో ఆరుమంది విచారణ ఎదుర్కొంటుండగా వీరిలో ఇద్దరు మృతి చెందారు. ఆచార్య గిరిరాజ్ కిషోర్ మరియు అశోక్ సింఘాల్ కేసు విచారణ సమయంలో మరణించారు. వీహెచ్‌పీ నేత వీహెచ్ దాల్మియా ఈ ఏడాది మృతి చెందాడు. దీంతో ఐదుగురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ కురవృద్ధులు అద్వానీ, మురళీమనోహర్ జోషి, వినయ్ కాతియార్, రీతాంభర, మరియు ఉమాభారతిలు ఉన్నారు.

2017 ఏప్రిల్ 19న బాబ్రీమసీదు కూల్చివేత ఘటనలో నమోదైన రెండు కేసులను కలిపి విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఇందుకోసం లక్నోలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక ఇక్కడే వాదనలు జరిగి కేసుపై తీర్పు చెప్పాలని అత్యున్నత ధర్వాసనం పేర్కొంది.

English summary
The Supreme Court Friday extended the deadline for a special CBI court in Lucknow to deliver verdict in the Babri Masjid demolition case, in which senior leaders of the BJP and VHP are accused, till August 31, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X