వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మను చూసేందుకు సుప్రీం అనుమతి -కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌కు 5రోజుల బెయిల్ -యూపీ పోలీస్ కట్టడి

|
Google Oneindia TeluguNews

అనారోగ్యంతో బాధపడుతూ, మరణానికి చేరువైన 90 ఏళ్ల ముసలి తల్లిని ఒక్కసారి చూసొస్తానంటూ వేడుకొన్న కొడుకును భారత సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు కనికరించింది. నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణలో ఆరు వాయిదాల తర్వాతగానీ సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఆ జర్నలిస్టు కొడుక్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరణశయ్యపై ఉన్న అమ్మను కలిసొచ్చేందుకుగానూ కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌కు ఐదు రోజుల బెయిల్ లభించింది. ఈ మేరకు..

వేదికపై కుప్పకూలిన సీఎంకు కరోనా పాజిటివ్ -స్థానిక ఎన్నికల్లో కొవిడ్ రూల్స్ పాటించని రూపానీవేదికపై కుప్పకూలిన సీఎంకు కరోనా పాజిటివ్ -స్థానిక ఎన్నికల్లో కొవిడ్ రూల్స్ పాటించని రూపానీ

సిద్ధిక్ కప్పన్ తల్లి చావుబతుకుల్లో ఉన్నందున ఆమెను కలిసేందుకుగానూ అతనికి ఐదు రోజుల బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యుజె) మూడు వారాల కిందట దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసం ఎట్టకేలకు సోమవారం విచారించింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కప్పన్ కు ఐదు రోజుల బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. అయితే..

SC grants 5 Days interim bail to Kerala Journalist Siddique Kappan to visit ailing mother

కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా 'టూల్ కిట్' కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా 'టూల్ కిట్' కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మధుర జైలులో ఉన్న సిద్ధిక్ కప్పన్ కేరళ వెళ్లి, తల్లిని చూసి తిరిగొచ్చేంత వరకూ పోలీసుల కట్టడిలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. యూపీ పోలీసుల టీమ్ ఒకటి ఈ ఐదు రోజులపాటూ కప్పన్ వెన్నంటి ఉంటుందని, బెయిల్ గడువులో ఆయన మీడియాతోగానీ, బయటి వ్యక్తులతోగానీ మాట్లాడరాదని సీజేఐ బెంచ్ ఆంక్షలు విధించింది. అయితే, సిద్ధిక్ తన తల్లితో మాట్లాడేటప్పుడు మాత్రం పోలీసులు ఆ గదిలో ఉండరాదని కోర్టు నిర్దేశించింది. డాక్టర్లు, భార్యాబిడ్డలతో మాత్రం సిద్ధిక్ మాట్లాడొచ్చని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఢిల్లీకి చెందిన పాత్రికేయుడు, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యుజె) ఢిల్లీ యూనిట్ కార్యదర్శి అయిన సిద్దిక్ కప్పన్ మలయాళ పోర్టల్ 'అజీముఖం' లో పనిచేసేవారు. గతేడాది సెప్టెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో దళిత యువతి గ్యాంగ్ రేప్, హత్యాకాండ ఘటనను కవర్ చేయడానికి వెళుతోన్న ఆయనతోపాటు మరో ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం మధుర జైలులో ఉన్న సిద్దిక్ పై తీవ్రవాద కలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)తోపాటు దేశద్రోహం అభియోగాలు కూడా నమోదయ్యాయి. విచారణకు సహకరిస్తానంటూనే.. ఒక్క సారి తల్లిని చూస్తానంటూ సిద్దిక్ విన్నవించుకోగా.. నాలుగు నెలల తర్వాతగానీ బెయిల్ లభించలేదు. నిజానికి..

SC grants 5 Days interim bail to Kerala Journalist Siddique Kappan to visit ailing mother

సిద్ధిక్ కప్పన్ తల్లి పరిస్థితిపై ఆరా తీసిన సుప్రీంకోర్టు.. జనవరి 22న.. నిందితుడు ఆమెతో మాట్లాడేందుకుగానూ 5నిమిషాల వీడియో కాల్ కు అనుమతించ్చింది. కానీ వీడియో కాల్ చేసిన సమయంలో ఆమె దాదాపు అపస్మారక స్థితిలో ఉండటంతో కొడుకును గుర్తుపట్టలేకపోయారు. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె.. మెలకువ వచ్చినప్పుడల్లా కొడుకును చూస్తానని అడుగుతోన్నట్లు న్యాయవాది చెబుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అర్నబ్ గోస్వామి లాంటి జర్నలిస్టులకు తీవ్రమైన కేసుల్లోనూ ఆఘమేఘాల మీద బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. కప్పన్ లాంటి సాదాసీదా జర్నలిస్టుల విషయంలో వ్యత్యాసం చూపుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతుండం తెలిసిందే.

English summary
The Supreme Court on Monday granted five-day interim bail to journalist Siddique Kappan to meet his ailing mother. In its order, the court said that the Uttar Pradesh Police will take Kappan to meet his mother in Kerala. It further ordered Kappan not to interact with the media and public, except relatives, doctors, and close family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X