వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2002 సర్దార్‌పుర అర్లర్ల కేసు: దోషులకు బెయిల్, సామాజిక సేవ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన సర్దార్‌పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారు గుజరాత్‌లోకి ప్రవేశించరాదని పేర్కొంది. మొత్తం 17 మంది దోషులను రెండు గ్రూపులుగా విభజించిన అత్యున్నత న్యాయస్థానం.. ఓ గ్రూపును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు, మరో గ్రూప్‌ను జబల్పూర్ వెళ్లాలని ఆదేశించింది.

అక్కడ వారానికి కనీసం ఆరుగంటలపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చరేసింది. నిందితులు ఉండబోయే ఇండోర్, జబల్పూర్ ప్రాంతాల్లో వారికి ఉపాధి మార్గాన్ని చూపాలని ఆయా జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని దోషులకు తెలిపింది.

దోషులు కోర్టు నిబంధనల్ని ఉల్లంఘించకుండా 'డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్' ఎప్పటికప్పుడు వారిపై నిఘా ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. మూడు నెలలు గడిచిని తర్వాత వారి వ్యవహారశైలిపై నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్‌కు స్పష్టం చేసింది.

SC grants bail to convicts in 2002 sardarpura riots case: tells them to do social service

కాగా, 2002 గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో విధ్వంసకర ఘటనలు చోటు చేసుకున్నాయి. సుర్దార్‌పుర అనే గ్రామంలో ఓ వర్గానికి చెందిన 33 మందిని మరో వర్గం సజీవ దహనం చేసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం 2002లో 73 మందిపై అభియోగాలు మోపింది. దీనిపై విచారణ చేపట్టిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో 31 మందిని దోషులుగా తేల్చింది.

ఈ తీర్పును గుజరాత్ హైకోర్టుల్ సవాల్ చేయగా.. సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో 14 మందిని నిర్దోషులుగా తేల్చింది. మరో 17 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. వీరికి మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయోధ్యకు వెళ్లి తిరిగి వస్తున్న గోద్రా రైలుకు ఓ వర్గంవారు నిప్పుపెట్టడంతో 59మంది(వీరిలో ఎక్కువగా కరసేవకులు(ఆర్ఎస్ఎస్)ఉన్నారు) సజీవ దహనమయ్యారు. అనంతరం గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి.

English summary
Thirteen of the 17 people convicted and sentenced to life for the 2002 post-Godhra massacre in which 33 people were burnt alive in Sardarpura have been ordered to be released on bail by the Supreme Court on Tuesday. The top court told the 14 people to do social service but ruled that they will have to stay out of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X