వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్ కర్ణన్ ఇష్యూలో సంచలనాలు, మరో కొత్త ట్విస్ట్

జస్టిస్ కర్ణన్ ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. మంగళవారం నాడు సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణతో పాటు ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జైలుకు వెళ్లడం ఇది తొలిసారి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జస్టిస్ కర్ణన్ ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. మంగళవారం నాడు సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణతో పాటు ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జైలుకు వెళ్లడం ఇది తొలిసారి.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బృందం కర్ణన్‌కు ఈ శిక్షను విధించింది. జస్టిస్ కర్ణన్ విషయంలో సంచలనాలు చూస్తున్న విషయం తెలిసిందే.

సంచలనం: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు జడ్జీలకు ఐదేళ్ల శిక్ష విధించిన జస్టిస్ కర్ణన్సంచలనం: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు జడ్జీలకు ఐదేళ్ల శిక్ష విధించిన జస్టిస్ కర్ణన్

సోమవారం జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

SC holds justice Karnan of contempt, sends him to 6 months in jail

భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌కు అయిదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు. సీజేఐతోపాటు మరో ఏడుగురికి అయిదేళ్ల శిక్ష విధిస్తున్నట్టు కర్ణన్‌ తెలిపారు.

ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలపాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కులవివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేద న్నారు.

గతంలో సుప్రీంకోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్‌ కర్ణన్‌కు సుప్రీం కోర్టు ధర్మాసనం మార్చి 17న కోర్టు ధిక్కార నేరం కింద బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.

అనంతరం గత వారం ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయ సంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని సుప్రీం కోర్టు పేర్కొంది. వైద్యుల సమక్షంలో ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే పరీక్షలు చేయించుకునేందుకు కర్ణన్‌ తిరస్కరించారు.

కొంతకాలంగా కోల్‌కతా హైకోర్టు జడ్జి కర్ణన్‌కు, సుప్రీంకోర్టు జడ్జిలకు మధ్య వివాదం నడుస్తోంది. తోటి హైకోర్టు జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిక్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్‌ కర్ణన్‌ను విచారించింది.

అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకొని న్యాయపరమైన చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.

English summary
The Supreme Court on Tuesday sentenced Justice C S Karnan to six months in prison. This makes C S Karnan the first sitting High Court judge to be convicted of contempt and sent to prison. A seven-judge bench of the Supreme Court led by Chief Justice of India J S Khehar held justice Karnan in contempt and passed the order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X