• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలిసే చేస్తోంది.. అల్గారిథమ్‌ను షేర్ చేయాల్సిందే.. ట్విట్టర్‌పై ఆరోపణలు.. సుప్రీం నోటీసులు..

|

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో.. ముఖ్యంగా ట్విట్టర్‌లో దేశ వ్యతిరేక,దేశద్రోహ పోస్టులను గుర్తించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ బీజేపీ నేత వినిత్ గోయెంకా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ట్విట్టర్‌ సహా పలు సోషల్ మీడియా సంస్థలకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని సుప్రీం బెంచ్ నోటీసులిచ్చింది.

తెలిసి కూడా ట్విట్టర్‌ అలా చేస్తోందని...

తెలిసి కూడా ట్విట్టర్‌ అలా చేస్తోందని...


పిటిషనర్ తరుపున కోర్టు ముందు హాజరైన సీనియర్ న్యాయవాది అశ్విని దూబే.. ట్విట్టర్‌లో భారత వ్యతిరేక,విద్వేషపూరిత కంటెంట్‌ను,ఫేక్ న్యూస్‌ను తనిఖీ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ట్విట్టర్‌ ద్వారా సమాజంలోని కొన్ని వర్గాల్లో భయాందోళనలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దేశ సమగ్రత,ఐక్యత,సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే రీతిలో ట్విట్టర్‌లో పోస్టులు వస్తున్నాయని పేర్కొన్నారు.దేశ చట్టాలకు ఆ కంటెంట్ విరుద్దమని తెలిసి కూడా ట్విట్టర్‌ వాటిని ప్రమోట్ చేస్తోందని ఆరోపించారు.

అల్గారిథమ్‌ను ప్రభుత్వంతో షేర్ చేయాలని...

అల్గారిథమ్‌ను ప్రభుత్వంతో షేర్ చేయాలని...

'ట్విట్టర్,ఇతర సోషల్ మీడియా కంపెనీలు కేవలం లాభాపేక్షతో పనిచేసే సంస్థలు. కాబట్టి సోషల్ మీడియా పట్ల భద్రతాపరమైన చర్యలు చాలా ముఖ్యం.' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు,ట్విట్టర్ ఉపయోగిస్తున్న లాజిక్,అల్గారిథమ్స్‌ను భారత ప్రభుత్వ అధికారులకు వెల్లడించాలని... తద్వారా దేశ వ్యతిరేక పోస్టుల తనిఖీకి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఇదివరకు సోషల్ మీడియా నియంత్రణపై దాఖలైన పిటిషన్లతో తాజా పిటిషన్‌ను ట్యాగ్ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం,ట్విట్టర్,పలు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

ట్విట్టర్‌తో వార్...

ట్విట్టర్‌తో వార్...

రైతు నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో వస్తున్న పోస్టులపై మోదీ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రైతు నిరసనలను అడ్డం పెట్టుకుని దేశాన్ని అస్థిరపరిచేందుకు,దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు సోషల్ మీడియా ద్వారా కుట్ర జరుగుతోందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా రైతు ఉద్యమంలో పాల్గొన్న నాయకుల ఖాతాలు, సెలబ్రిటీల ట్వీట్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం... ఆ ఖాతాలను నిలిపివేయాల్సిందిగా ట్విట్టర్‌ను ఆదేశించింది. అయితే ట్విట్టర్ ఆలస్యంగా చర్యలు తీసుకోవడంతో కేంద్రం ఆగ్రహంతో ఉంది.

సోషల్ మీడియా నియంత్రణ దిశగా...

సోషల్ మీడియా నియంత్రణ దిశగా...


ట్విట్టర్‌తో నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా కూ యాప్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు ఇందులో చేరారు. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ దేశీ యాప్‌ను ఉపయోగించాలని దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. మరోవైపు దేశంలోని సోష‌ల్ మీడియా వేదిక‌లు, ఓవ‌ర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌, న్యూస్ సంబంధిత వెబ్‌సైట్ల‌ నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

English summary
The Supreme Court on February 12 issued a notice to Twitter and the Centre, in a petition to check fake news and incendiary messages on social media.The Public Interest Litigation (PIL) was filed by Bharatiya Janata Party (BJP) leader Vinit Goenka in May 2020. It is seeking a direction to the Centre to devise a mechanism to check fake news and instigative messages on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X