వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దెబ్బ రెండు పిట్టలు ... ఆయోధ్య మధ్యవర్తిత్వంపై సల్మాన్ ఖుర్షీద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అయోధ్య భూ వివాద మధ్యవర్తిత్వం ఒకే దెబ్బ రెండు పిట్టలు అన్నట్టు ఉందన్నారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య భూవివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు చూపిన చొరవ అభినందనీయం. కానీ ఎన్నికలను నెలల ముందు మధ్యవర్తిత్వాన్ని ఖరారు చేయడంలో ఆంతర్యం ఏముందన్నారు. అయినా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

SC Killed 2 Birds With One Stone: Salman Khurshid on Ayodhya Mediation Ahead of Polls

ఒకే దెబ్బ రెండు పిట్టలు
భూ వివాద సమస్య పరిష్కారం కోసం రెండు నెలల గడువు ఆందోళన కలిగిస్తోంది. విచారణ జరిపి నివేదిక పూర్తయ్యే లోపు లోక్ సభ ఎన్నికలు వస్తాయని .. ఈ ప్రక్రియ ఎన్నికల్లో భాగం కాదని, అలాగే ఏ పార్టీ ఎన్నికల్లో తమ ప్రచారాస్త్రం ఎంచుకోదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసాక మాత్రమే తమ గొప్ప అనే చెప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూ వివాద అంశంపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, శివసేన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధాని మోదీని కోరారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోబోనని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..?

SC Killed 2 Birds With One Stone: Salman Khurshid on Ayodhya Mediation Ahead of Polls

రవిశంకర్ నియమాకానికి ఓకే ..?
ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ కు ప్యానెల్ లో చోటు కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రాం మందిర్ కు అనుకూలంగా వ్యవహరిస్తారనే వాదనలు కొనసాగుతున్నాయి. రవిశంకర్ అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ సర్వోన్నత న్యాయస్థానం .. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మసులుకుంటుందని భావిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ .. రవిశంకర్ కు చోటు కల్పించడాన్ని కూడా స్వాగతిస్తున్నామని చెప్పారాయాన.

English summary
Welcoming the Supreme Court move to refer the long-pending Ram Janmabhoomi-Babri Masjid title dispute for mediation just months ahead of the general elections, veteran Congress leader Salman Khurshid said the top court has "killed two birds with one stone". "As far as the eight weeks' time frame and elections are concerned, I believe the SC has killed two birds with one stone. Because this will make sure that the case will not be part of the election discourse and will be independent of that. And no one can use this issue. It will be done only after elections are done with," said Salman Khurshid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X