వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలోనే మసీదుకు 5 ఎకరాలు భూమి, కానీ: తీర్పుపై హిందూ మహాసభ లాయర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య భూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హిందూ మహాసభ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ స్పందించారు. అయోధ్యలోనే కానీ.. వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని జైన్ తెలిపారు.

Ayodhya Verdict: 'ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం'Ayodhya Verdict: 'ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం'

Ayodhya verdict: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మినిట్-టూ- మినిట్ అప్‌డేట్స్, హైలైట్స్Ayodhya verdict: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మినిట్-టూ- మినిట్ అప్‌డేట్స్, హైలైట్స్

అయోధ్యలోనే ఏ ప్రాంతంలో మసీదు నిర్మాణానికి భూమి ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై హిందూ మహాసభ తరపు మరో లాయర్ వరుణ్ కుమార్ సిన్హా స్పందించారు. 'ఇది చారిత్రక తీర్పు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది' అని వరుణ్ కుమార్ సిన్హా వ్యాఖ్యానించారు.

SC ordered to allot 5 acres of alternate land for mosque: hindu mahasabha lawyer

కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. .

నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

English summary
Vishnu Shankar Jain, the lawyer representing Hindu Mahasabha on Saturday said that the Supreme Court has ruled that five acres of land at an alternate location in Ayodhya will be given for the construction of a mosque.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X