వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద పురుషత్వ పరీక్ష చేయించుకోవాల్సిందే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

SC orders Nityananda to go for potency test
హైదరాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకుండా చూడాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌ను అత్యున్నత న్యాయస్దానం సుప్రీం కోర్టు కొట్టేసింది. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పురషత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి కర్ణాటక హైకోర్టు గత నెలలో అనుమతించిన విషయం తెలిసిందే. గతంలో ఇదే విషయంపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. బుధవారం స్టే తొలగించిన సుప్రీం కోర్టు నిత్యానంద పురుషత్వ, రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది.

కాగా, సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు.

దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో, నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

English summary
The self-styled godman Nityananda, facing criminal charges including rape, has been directed by the Supreme Court to undergo the medical test for potency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X