వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ రమణ మరో సంచలనం -చిన్న కేసుల్లో అరెస్టులు వద్దు -ఆ ఖైదీల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా విలయం కొనసాగుతోన్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ గడిచిన రెండు వారాలుగా మానవహక్కుల కోణంలో కీలక తీర్పులు, ఆదేశాలు వెలువర్చడంతోపాటు, మహమ్మారి నిర్వహణలో విఫలమైన మోదీ సర్కారుకు దాదాపు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖైదీల భద్రత, కరోనా సమయంలో పోలీసుల ఓవరాక్షన్ తదితర అంశాలపై సీజేఐ రమణ నేతృత్వం జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది...

షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..

జైళ్లలో రద్దీ.. ఖైదీల విడుదల

జైళ్లలో రద్దీ.. ఖైదీల విడుదల

కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోన్న వేళ దేశంలోని జైళ్లలో ఖైదీలు కిక్కిరి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో రద్దీని తగ్గించేలా పెద్ద ఎత్తున ఖైదీల విడుదల కోసం సీజేఐ రమణ బెంచ్ శనివారం ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం జైళ్లలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్న కోర్టు.. బెయిల్, పెరోల్ కు అవకాశం ఉన్న అందరు ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఖైదీల స్థితిగతులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హై పవర్డ్‌ కమిటీ (హెచ్‌పీసీ)ల ఆధ్వర్యంలో విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించింది.

90 రోజుల పెరోల్ లేదా బెయిల్

90 రోజుల పెరోల్ లేదా బెయిల్

రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని హైపవర్డ్ కమిటీల ఆధ్వర్యంలో విడుదలయ్యే ఖైదీల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లలో అప్ డేట్ చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని, గతేడాది తొలి వేవ్ సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా అర్హులైన ఖైదీలందరికీ బెయిల్, పెరోల్ మంజూరు చేయాలని, గత జాబితాలోని వారిని కచ్చితంగా విడుదల చేస్తూనే, కొత్త వారి పేర్లనూ విడుదల జాబితాలో చేర్చాలని సుప్రీం ఆదేశించింది. గత ఏడాది మహమ్మారి తీవ్రత కారణంగా విడుదలైన ఖైదీల్లో 90% మంది నిబంధనల ప్రకారం మళ్లీ కారాగారాలకు చేరిన సంగతిని ధర్మాసనం గుర్తుచేసింది. అలాగే..

జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?

Recommended Video

Ys Jagan సర్కారుకి హైకోర్టు సూచన, లోపాలు ఉన్నాయ్ చూస్కోండి
చిన్న నేరాలకు అరెస్టులు వద్దు..

చిన్న నేరాలకు అరెస్టులు వద్దు..

కరోనా వేళ జైళ్లలో పరిస్థితిని సమీక్షించిన సీజేఐ బెంచ్ ఖైదీలకు సంబంధించిన అంశాలతోపాటు కొత్త అరెస్టులపైనా సంచలన ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జైళ్లలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి చిన్న చిన్న నేరాలు.. అంటే, ఏడాదిలోపు మాత్రమే శిక్షపడే అవకాశాలున్న కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేయరాదని, కచ్చితంగా అత్యవసరం అనుకుంటేనే నిందితులను రిమాండ్ కు తరలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. జైలు లోపల ఖైదీలకు అనువైన వాతావరణం ఉండేలా చూడాలని, కొవిడ్ బారిన పడకుండా సకల జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వాలకు సుప్రీం సూచించింది.

English summary
a special Bench of Chief Justice NV Ramana and Justices L Nageswara Rao and Surya Kant of Supreme Court on Saturday passed a detailed order on decongesting prisons amid the raging second wave of Covid-19, saying that the police should not arrest the accused unless necessary in crimes sentenced with less than seven years of imprisonment, and directed authorities to ensure that proper medical facilities are provided to the inmates. The high-powered committees constituted by the state governments and Union territories have been asked to identify and release the vulnerable categories of prisoners on an urgent basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X