వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పద్మావత్ చిత్రానికి సుప్రీంలో ఊరట: రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చురకలు

Padmaavat : పద్మావత్ చిత్రానికి సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలపాలైన పద్మావత్ సినిమాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో మరోసారి మద్దతు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లో మార్చమని చెప్పింది.
మంగళవారం నాడు సుప్రీం కోర్టు మరోసారి అండగా నిలిచింది. సినిమా విడుదలను ఆపివేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో జనవరి 25న పద్మావత్ విడుదల కానుంది.

పద్మావత్ చిత్రాన్ని ప్రదర్శించలేమంటూ పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!