వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు...ఆపాలంటూ కోర్టు వెళ్లిన కాంగ్రెస్... పిటిషన్ కొట్టివేసిన సుప్రిం

|
Google Oneindia TeluguNews

రెండు రాజ్యసభ స్థానాలకు కూడ ప్రత్యేకంగా ఎన్నికలా... అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్‌ను విచారించిన సుప్రిం కోర్టు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రిం కోర్టు కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిర్యాధులన్ని కమీషన్ పరిధిలోకి వెళతాయని స్పష్టం చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఇటివల పోటి చేసి గెలిచిన హోమంత్రి అమిత్ షాతోపాటు మరోమంత్రి స్మృతి ఇరానిల రాజ్యసభ స్థానాలకు ఖాలీ అయ్యాయి..దీంతో ఆ రెండు స్థానాలను భర్తి చేసేందుకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది..దీంతో జూలై 5 ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది..అయితే రెండు స్థానాలు కూడ గుజరాత్ నుండి ఖాలీ కావడంతో ఆ రాష్ట్ర్ర కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది..రెండు స్థానాలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడం ఏమిటంటూ అభ్యంతరం తెలిపింది..దీని ద్వార ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు పేర్కోంది. వెంటనే ఎన్నికలను ఆపాలని పిటిషన్‌లో తెలిపింది.

SC rejected a petition to hold separate bypolls to two Rajya Sabha seats

దీంతో పిటిషన్‌ను స్వీకరించిన సుప్రిం కోర్టు నేడు విచారణ చేపట్టింది..అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్ ఎన్నికలు అయిన తర్వాత పిటిషన్ వేయాలని సూచిస్తూ ..నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివాదాలన్ని ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళతాయని పేర్కోంది. కాగా కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్‌లో పేర్కోన్నట్టుగా ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరగలేదని సుప్రిం కోర్టు స్పష్టం చేసింది.

English summary
The Supreme Court today rejected a petition by the Gujarat Congress challenging the Election Commission's decision to hold separate bypolls to two Rajya Sabha seats that fell vacant after BJP's Amit Shah and Smriti Irani moved to the Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X