వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహారా, బిర్లా డైరీల కేసులో మోడీకి ఊరట: కేసును విచారించలేమన్న సుప్రీం

సహారా డైరీల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సహారా డైరీల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును విచారించలేమని తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహారా, బిర్లా కంపెనీల నుంచి ఆయనకు ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

గత నవంబర్ 14న విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తాజాగా సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై కోర్టు మరోసారి విచారణ జరిపింది.

SC Rejects probe into Sahara-Birla Diaries

సాక్ష్యాలేవీ చూపకపోయినా సహారా, బిర్లా డైరీలలో పేర్కొన్న విషయాల ఆధారంగా అందులో ఉన్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఏదైనా నేరం చేస్తే ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన తన పిటిషన్ లో గుర్తు చేసారు.

అయితే, ప్రభుత్వం తరుపున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదిస్తూ.. కార్పొరేట్ల నుంచి మోడీ ముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఇలాంటి పత్రాలను లీగల్ ఎవిడెన్స్ గా పరిగణించడం దేశ భద్రతకే ముప్పని వ్యాఖ్యానించారు.

2013, 2014 సంవత్సరాలలో సీబీఐ, ఐటి శాఖ అధికారులు సహారా, బిర్లా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి సేకరించిన పత్రాలనే సహారా డైరీలుగా పరిగణిస్తున్నారు. వాటిలో అప్పటి గుజరాత్ సీఎం మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ లతో పాటు పలు ఇతర పార్టీల నేతల పేర్లు కూడా ఉన్నాయి.

English summary
The Supreme Court on Wednesday rejected a petition that sought a probe into the Sahara-Birla diaries. While rejecting the petition filed by an NGO that sought a probe into the IT raids conducted on Sahara and Birla in which the names of certain politicians came up, the SC said that there is no cogent evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X