వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు: తాత్కాలిక డైరెక్టర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ నియామకంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అలోక్ వర్మ పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు రెండు వారాల గడువు ఇచ్చింది.

<strong>సీబీఐ డైరెక్టర్‌గా వరంగల్ వ్యక్తి, అవార్డులు.. పదవులు.. ప్రత్యేకతలెన్నో: ఎవరీ నాగేశ్వరరావు?</strong>సీబీఐ డైరెక్టర్‌గా వరంగల్ వ్యక్తి, అవార్డులు.. పదవులు.. ప్రత్యేకతలెన్నో: ఎవరీ నాగేశ్వరరావు?

అలాగే, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ నియామకం పైన కేంద్ర ప్రభుత్వానికి, సీవీసీ, సీబీఐకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

SC Says CVC Probe Against Alok Verma to be Completed in 2 Weeks, Former Judge to Monitor

సీవీసీ దర్యాఫ్తును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరగాలని పేర్కొంది. కాగా, కొత్త డైరెక్టర్‌గా నాగేశ్వర రావు నియామకాన్నిసవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టు గడపను తొక్కిన విషయం తెలిసిందే.

Recommended Video

నాగేశ్వరరావు నియామకం పై జేపీ స్పందన

English summary
The Supreme Court on Friday said the CVC enquiry on allegations and counter-allegations in the nasty feud between CBI Director Alok Verma and Special Director Rakesh Asthana should be completed in 10 days under supervision of court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X