వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిస్థితి తీవ్రం.. అల్లర్లు చెలరేగే అవకాశం: నోట్ల రద్దుపై సుప్రీం సంచలన వ్యాఖ్య

'నోట్ల రద్దు కారణంగా దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది.. ఈ తీవ్రతలు అల్లర్లకు చెలరేగవచ్చు'. నోట్ల రద్దు నిర్ణయంపై దాఖలైన పిటిషన్ల విచారణ నేపథ్యంలో.. సుప్రీం చేసిన వ్యాఖ్యలివి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 'నోట్ల రద్దు కారణంగా దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది.. ఈ తీవ్రతలు అల్లర్లకు చెలరేగవచ్చు'. నోట్ల రద్దు నిర్ణయంపై దాఖలైన పిటిషన్ల విచారణ నేపథ్యంలో.. సుప్రీం చేసిన వ్యాఖ్యలివి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో స్పందించింది సుప్రీం కోర్టు. నగదు మార్పిడి విషయంలోను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీం.

నిన్నటిదాకా రూ.4500 వరకు నగదు మార్పిడి వెసులుబాటు కల్పించిన కేంద్రం.. నేటి నుంచి ఆ పరిమితిని రూ.2వేలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సుప్రీం తప్పుబట్టింది. నగదు మార్పిడి పరిమితిని రూ.2వేలకు ఎందుకు కుదించారంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.
మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఆయా రాష్ట్రాల్లో దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది.

 SC says situation after demonetisation serious, there could be riots

కాగా, బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు డబ్బులు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న మాట మాత్రం వాస్తవమేనని సుప్రీం ధర్మాసనం ముందు కేంద్రం అంగీకరించింది. పిటిషన్లపై విచారణ నిలిపేయాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో దాఖలైన పటిషన్లు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయంటూ పేర్కొంది కోర్టు.

ఆయా రాష్ట్రాల హైకోర్టు పరిధిలో దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయించుకుని విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు అదేశాలు జారీ చేసింది.

English summary
The Supreme Court on Friday questioned the government’s move to reduce the exchange limit of old notes from Rs 4,500 to Rs 2,000, saying the situation was serious and there could be riots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X