వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించండి: కేంద్రానికి సుప్రీం ఆదేశం

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాఫెల్ ఒప్పంద వివరాలు సీల్డ్ కవర్లో..!

న్యూఢిల్లీ: రాఫెల్ కొనుగోలు ఒప్పందంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలోనే రాఫెల్ వివరాలను వెల్లడించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను బుధవారం న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానం ముందు ఉంచాలంటూ కేంద్రప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తెలపండి

రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తెలపండి

రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజయ్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ధరల వివరాలు కేంద్ర ప్రభుత్వం తెలపాల్సిన అవసరం లేదని.. అసలు యుద్ధ విమానాలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న అంశం కూడా కేంద్రం చెప్పాల్సిన అవసరం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అదే సమయంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు నిర్ణయం ఎలా జరిగిందో... అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరిస్తూ సీల్డ్ కవర్‌లో అక్టోబర్ 29లోగా కోర్టుముందు ఉంచాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో చేసుకుందో రిలయన్స్ డిఫెన్స్ కంపెనీని ఆఫ్‌సెట్ భాగస్వామిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కోర్టు డిసైడ్ చేస్తుందని ధర్మాసనం తెలిపింది.

 దేశభద్రత వివరాలు బహిర్గతం చేయలేము: అటార్నీజనరల్

దేశభద్రత వివరాలు బహిర్గతం చేయలేము: అటార్నీజనరల్


మరోవైపు రాఫెల్‌కు సంబంధించిన అంశంపై ఎలాంటి అధికార నోటీసులు ఇవ్వడంలేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అంతేకాదు రాఫెల్ ఒప్పందంకు సంబంధించిన పిల్‌లో చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేదని... కేవలం సమాచారం తెలుసుకునేందుకు సీల్డ్ కవర్‌లో వివరాలను అడిగినట్లు ధర్మాసనం వెల్లడించింది. వాదనల సందర్భంగా కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్- ఇది కేవలం రాజకీయ లబ్ధికోసమే వేశారని ఇందులో దేశ భద్రతా అంశాలు మిళితమై ఉన్నందున బహిర్గతం చేయలేమన్నారు. వెంటనే పిటిషన్‌ను డిస్మిస్ చేయాల్సిందిగా కేకే వేణుగోపాల్ న్యాయస్థానాన్ని కోరారు.

అవినీతి జరిగిందని తేలితే ఒప్పందం రద్దు చేయండి: పిటిషనర్లు

అవినీతి జరిగిందని తేలితే ఒప్పందం రద్దు చేయండి: పిటిషనర్లు

రాఫెల్‌కు సంబంధించిన అంశాలు కేవలం కోర్టుకు మాత్రమే తెలియజేయగలరా అని ధర్మాసనం కోరగా... అది సాధ్యపడదని కేకే వేణుగోపాల్ చెప్పారు. దేశానికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలను అటార్నీ జనరల్‌గా ఉన్న తనకు కూడా చెప్పరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ రాఫెల్ డీల్‌కు సంబంధించిన నిర్ణయాలు వివరంగా తెలుపుతూ కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ రెండు ప్రజాప్రయోజన వాజ్యాలను సుప్రీంకోర్టు లాయర్లు వినీత్ దండా, ఎమ్ఎల్ శర్మలు దాఖలు చేశారు. ఒకవేళ అవినీతి జరిగిందని తేలితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని కోర్టును పిల్‌లో కోరారు పిటిషనర్లు.

English summary
Brushing aside the Centre's objections, the Supreme Court on Wednesday directed the government to lay out before it the steps in the decision-making process for acquisition of Rafale jets from France.A bench headed by Chief Justice of India Ranjan Gogoi made it clear that the central government will not be required to answer issues relating to pricing of the jets and suitability of the aircraft in question.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X