వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలే కదా అని నీళ్లు కలిపారో ఇక అంతే.. కోర్టులు కన్నెర్ర చేస్తాయి... 24 ఏళ్ల క్రితం నాటి కేసులో శిక్ష

|
Google Oneindia TeluguNews

పాలు.. గోవు, గోదె నుంచి తీసుకుంటాం. చిక్కని పాలు పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి మంచిది. పౌష్టికాహారం కూడా. అయితే కొందరు పాల వాళ్లు వాటిలో నీళ్లు పోస్తుంటారు. దాదాపు అన్నీ చోట్ల పాల వ్యాపారులు నీళ్లు కలుపుతుంటారు. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాలల్లో నీళ్లు కలిపిన యాజమానిపై కఠినశిక్ష విధించింది.

పాలే కదా అనుకుంటే..

పాలే కదా అనుకుంటే..

యూపీకి చెందిన రాజ్‌కుమార్ పాల వ్యాపారం చేస్తుంటాడు. అయితే అతను చిక్కని పాలల్లో నీళ్లు కలిపి విక్రయిస్తుంటాడు. అలా 24 ఏళ్ల క్రితం చేసిన తప్పు వెంటాడుతూనే ఉంది. పాలల్లో నీళ్లు కలుపడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సీరియస్‌గా పరిగణించింది. రాజ్‌కుమార్‌కు 6 నెలల జైలుశిక్ష విధించింది. భవిష్యత్‌లో మరో ఇతర పాల వ్యాపారి నీళ్లు కలిపేందుకు భయపడాలని ధర్మాసనం పేర్కొన్నది.

24 ఏళ్ల క్రితం

24 ఏళ్ల క్రితం

రాజ్‌కుమార్ పాల వ్యాపారం చేసేవాడు. 24 ఏళ్ల క్రితం పాలు పోస్తుంటేవాడు. అయితే పాలల్లో ఎక్కువగా నీళ్లు కలుపడంతో అనుమానం వచ్చింది. సాధారణంగా పాలలో 8.5 శాతం ఫ్యాట్ ఉండాలి. కానీ రాజ్‌కుమార్ పాలలో అదీ 4.6 శాతంగా మాత్రమే ఉంది. 7.7 శాతం నీళ్లు ఉన్నట్టు తేలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పరీక్ష చేస్తే విషయం వెలుగుచూసింది. దీంతో వారు సెషన్స్ కోర్టులో కేసు నమోదు చేశారు. అక్కడ రాజ్‌కుమార్‌కు చుక్కెదురైంది. అతని చేసింది తప్పు అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

హైకోర్టులో కూడా

హైకోర్టులో కూడా

దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. అక్కడ కూడా సేమ్ సిచుయేషన్.. ఇక లాభం లేదనుకొని రాజ్‌కుమార్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌, జస్టిస్ అనిరుద్ బోస్ నేతృత్వంలోని ధర్యాసనం కేసు విచారణ చేపట్టింది. కేసులో రాజ్‌కుమార్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్‌కుమార్ హద్దు మీరి ప్రవర్తించారని, స్వచ్చంగా విక్రయించాల్సిన పాలలో కల్తీ సరికాదన్నారు.

కొవ్వుశాతంలో తేడా

కొవ్వుశాతంలో తేడా

ఈ కేసులో రాజ్‌కుమార్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. పాలకు సంబంధించి కొవ్వుశాతం తగ్గుతుంది, పెరుగుతుంది అని వివరించారు. గోవులకు వేసే గడ్డి, ఇతర పౌష్టికాహారం, దాని ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పాలలో కొవ్వు శాతం ఉంటుందని వివరించారు. కానీ వారి వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. పాలు అనేది ప్రాథమిక పౌష్టికాహారానికి సంబంధించినదని పేర్కొన్నారు. దానిని కూడా కల్తీ చేయడం సరికాదన్నారు. రాజ్‌కుమార్‌కు 6 నెలల జైలుశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

English summary
Supreme Court has sent a milkman from Uttar Pradesh to jail for six months for diluting milk nearly 24 years ago, saying the accused cannot be acquitted even if the the deficiency was marginal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X