వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ కూల్చివేత కేసు- అద్వానీ, జోషీ, ఉమాభారతి భవితవ్యంపై తీర్పు- సుప్రీం కొత్త డెడ్‌లైన్‌...

|
Google Oneindia TeluguNews

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతిల భవితవ్యాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు కొత్త డెడ్‌ లైన్ ప్రకటించింది. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో వాదనలు దాదాపుగా పూర్తి కావడంతో సీబీఐ కోర్టు తీర్పు ప్రకటించేందుకు సీబీఐ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను పొడిగించింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వచ్చే నెల 30న తుది తీర్పు ప్రకటించేందుకు సీబీఐ కోర్టుకు అవకాశం కల్పిస్తూ స్తామని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం, అయోధ్య జడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పు ప్రకటించే తేదీని పొడిగించింది. ఈ కేసులో విచారణ పూర్తి సేందుకు తనకు మరి కొంత సమయం కావాలన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఇదే విజ్ఞప్తితో గతంలో ఆగస్టు 31 లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చినా పలు కారణాలతో విచారణ ఆలస్యమైనందున మరోసారి పొడిగింపు ఇవ్వక తప్పలేదు.

sc sets new deadline for verdict on advani, joshi and uma in babri masjid demolition case

Recommended Video

Ram Mandir Bhoomi Pujan : బాబ్రీ జిందాహై - భూమిపూజ వేళ Asaduddin Owaisi కీలక వ్యాఖ్యలు! || Oneindia

కరోనా కారణంగా అయోధ్యలోని ప్రత్యేక సీబీఐ కోర్టు విచారణ నానాటికీ ఆలస్యమవుతోంది. ఇందులో బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతికి వ్యతిరేకంగా దాఖలైన బాబ్రీ మసీదు విధ్వంసం కేసుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. అయితే అయోధ్య స్ధలం యాజమాన్య హక్కులపై కూడా క్లారిటీ వచ్చినందున ఇక విధ్వంసం కేసునూ త్వరగా ముగించాలని సుప్రీం ధర్మాసనం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సూచించింది.

English summary
the supreme court has set september 30 as a new deadline for giving final verdict oin advani, murali manohar joshi and uma bharati in babri masjid demolition case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X