వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానందకు ఊరట, కొత్తపల్లి గీత కేసులో వ్యక్తి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

SC stays order on medical test of Nityananda Swamy
న్యూఢిల్లీ/విశాఖ: అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద స్వామికి వైద్య పరీక్షల నిర్వహణ పైన సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది నిత్యానందకు ఊరట. మరోవైపు, నిత్యానంద కేసు నాలుగేళ్లుగా నత్తనడకన సాగడం పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిత్యానంద స్వామి ఆగస్టు ఆరవ తేదీన పురుషత్వ పరీక్షలకు హాజరు కావాలని కర్నాటక హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర కోర్టు ఆదేశించింది. దీనిపై స్టే విధించాలని నిత్యానంద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురయింది. దీంతో అతను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో నిత్యానందకు తాత్కాలిక ఊరట లభించింది.

కాగా, సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు.

దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో, నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

కొత్తపల్లి గీత కేసులో అరెస్ట్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పైన పేస్‌బుక్‌లో అసభ్య కామెంట్లు పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరి పేరు కిరణ్ అని తెలుస్తోంది.

English summary
The Supreme Court on Tuesday stayed for the time being the Karnataka High Court order directing that self styled godman Nithyananda, an accused in a rape case, be subjected to a medical test to determine his potency level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X