వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం ఈడీ కేసు... బెయిల్ పిటిషన్ పై సుప్రింలో కొనసాగుతున్న వాదనలు

|
Google Oneindia TeluguNews

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పై ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాదులు వాదించారు. ఆయనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పిన ఈడీ వాటిని బయట పెట్టాలని కోరారు. చిదంబరం బెయిల్‌పై సుప్రిం కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దీంతో చిదంబరంను తమ కస్టడీకి ఇవ్వాలని కోరడంతో నేడు మరోసారి వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనకు మంగళవారం వరకు ఈడీ అరెస్ట్ చేయకుండా ఉపశమనం కల్గించిన విషయం తెలిసిందే...

డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలోనే చిదంబరం దానిపై సుప్రిం కోర్టుకు వెళ్లారు. దీంతో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం సుప్రిం కోర్టును ఆశ్రయించడంతో మంగళవారం విచారణకు చేపట్టింది. మంగళవారం మధ్యహ్నం చేపట్టిన వాదనలను నేటికి వాయిదా వేసింది. దీంతో మరోసారి కూడ ముందస్తు బెయిల్‌పై వాదనలు కొనసాగనున్నాయి. కాగా నిన్నటి వరకు చిదంబరంను ఆయన్ను ఆరెస్ట్ చేయకుండా సుప్రిం కోర్టు ఉపశమనం కల్గించింది.

SC to continue to hear plea of Chidambaram anticipatory plea.

దర్యాప్తు జరుపుతున్న సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదనే కారణంతోనే ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తున్నారని, ఈనేపథ్యంలోనే దర్యాప్తు సంస్థలు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానలు ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని చిదంబరం తరపుణ వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రశ్నించారు. ఇది ఆర్టికల్ 21కు వ్యతిరేకమని చెప్పారు. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడీయా కేసుకు సంబంధించి ఈ నెల ముప్పై వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మరో రెండు రోజుల పాటు చిదంబరం సీబీఐ కస్టడీలో కొనసాగనున్నారు.

English summary
SC to continue to hear today also plea of Chidambaram against Delhi HC order dismissing his anticipatory plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X