వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో నేడు తేలనున్న చిదంబరం భవితవ్యం: కస్టడీ పొడగించాలని కోరనున్న సీబీఐ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీ సోమవారంతో ముగియనుంది. మరో వైపు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా ఈరోజే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే, సీబీఐ చిదంబరం విచారణకు మరింత సమయం కావాలని కూడా కోరే అవకాశం ఉంది.

సీబీఐ, చిదంబరం పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తమ తీర్పును వెలువరించనుంది. సీబీఐ కోర్టు చిదంబరంను విచారించేందుకు నాలుగు రోజులపాటు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. నేటితో ఆ గడువు ముగియనుండటంతో సుప్రీంకోర్టు చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది.

SC to hear Chidambaram appeal today: CBI may seek extension of custody

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గత బుధవారం ఢిల్లీ హైకోర్టు చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టడంతో నాలుగు రోజులపాటు కస్టడీ విధించింది. ఆ కస్టడీ ఈ సోమవారంతో ముగిసింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేగాక చిదంబరం విచారణకు సరిగా సహకరించడం లేదని సీబీఐ సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. ఈ కారణంగా మరిన్ని రోజులు తమకు చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం సుప్రీంకోర్టులో ఉండనుంది.

English summary
Former finance minister P Chidambaram, who is under the Central Bureau of Investigation's (CBI) custody since last Thursday (August 22), has by far been non-cooperative during the agency's interrogation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X