వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ ఆస్తులపై స్పష్టతేదీ?: మాల్యాపై సుప్రీం ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించనందుకు లిక్కర్ వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లో అందజేయాలని ఆదేశించింది.

SC unhappy with Mallya's disclosure, orders him to come clean on all foreign assets

గత ఫిబ్రవరిలో బ్రిటన్ సంస్థ డయాజియో నుంచి స్వీకరించిన 40 మిలియన్ డాలర్లకు సంబంధించిన వివరాలను అందజేయకపోవడం పట్ల జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని బట్టి గత ఏప్రిల్ 7న ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని ప్రాథమికంగా నిర్ధారణ అవుతోందని పేర్కొంది.

40 మిలియన్ డాలర్లను ఎలా స్వీకరించారు. వాటిని ఏం చేశారన్న వివరాలు అందజేయాలని ఆదేశించింది. మాల్యా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, న్యాయస్థానాలను మోసం చేసేందుకు ప్రయత్నించాడని అటార్నీ జనరల్ రోహత్గీ పేర్కొన్నారు. సుమారు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. లండన్ పారిపోయి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే.

English summary
"Vijay Mallya is directed to make a complete disclosure of all his properties ... in particular, in respect of $40 million which Diageo paid in February," the apex court bench directed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X