వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరణశయ్యపై తల్లి -ఇంకా తేల్చని సుప్రీం -జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ బెయిల్‌పై విచారణ ఎప్పుడు?

|
Google Oneindia TeluguNews

90 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణానికి చేరువైన ఆ తల్లి.. తన చివరి కోరికగా చిన్న కొడుకును చూడాలనుకుంటోంది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆ జర్నలిస్టు కొడుకుకు కేవలం ఐదు రోజుల పాటు బెయిల్ ఇస్తే చాలని జర్నలిస్టు సంఘాలు మొరపెట్టుకుంటున్నాయి. గడిచిన నాలుగు నెలల్లో ఇప్పటికే ఆరు సార్లు పిటిషన్ల విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ తేదీని ఇంకా ఖరారు చేయకపోవడం చర్చనీయాంశమైంది..

కుప్పం పంచాయితీలోనూ మాదే గెలుపు -అమిత్ షాపై రాళ్లదాడి, కాళ్లబేరాలా? -చంద్రబాబుపై వైసీపీ ఫైర్కుప్పం పంచాయితీలోనూ మాదే గెలుపు -అమిత్ షాపై రాళ్లదాడి, కాళ్లబేరాలా? -చంద్రబాబుపై వైసీపీ ఫైర్

కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తాత్సారం జరుగుతోందని ఆయన తరఫు అడ్వొకేట్ విల్స్ మ్యాథ్యూస్ చెబుతున్నారు. సిద్ధిక్ కప్పన్ తల్లి మరణశయ్యపై ఉన్నందున ఆమెను కలిసేందుకుగానూ అతనికి ఐదు రోజుల బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యుజె) గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. అయితే, ఆ పిటిషన్ ఇంకా విచారణకు లిస్ట్ కాలేదని అడ్వొకేట్ చెబుతున్నారు.

SC Yet to List Siddique Kappans Bail Plea to Visit Mother on Her Deathbed

ఢిల్లీకి చెందిన పాత్రికేయుడు, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యుజె) ఢిల్లీ యూనిట్ కార్యదర్శి అయిన సిద్దిక్ కప్పన్ మలయాళ పోర్టల్ 'అజీముఖం' లో పనిచేసేవారు. గతేడాది సెప్టెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో దళిత యువతి గ్యాంగ్ రేప్, హత్యాకాండ ఘటనను కవర్ చేయడానికి వెళుతోన్న ఆయనను యూపీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం మధుర జైలులో ఉన్న సిద్దిక్ పై తీవ్రవాద కలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)తోపాటు దేశద్రోహం అభియోగాలు కూడా నమోదయ్యాయి. విచారణకు సహకరిస్తానంటూనే.. ఒక్క సారి తల్లిని చూస్తానంటూ సిద్దిక్ విన్నవించుకుంటున్నా ఫలితం రాలేదు..

షాక్: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ -2న అర్ధరాత్రి ఘటన -తన జవాన్ల కోసం ఇరాన్ సంచలన చర్యషాక్: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ -2న అర్ధరాత్రి ఘటన -తన జవాన్ల కోసం ఇరాన్ సంచలన చర్య

సిద్ధిక్ కప్పన్ తల్లి పరిస్థితిపై ఆరా తీసిన సుప్రీంకోర్టు.. జనవరి 22న.. నిందితుడు ఆమెతో మాట్లాడేందుకుగానూ 5నిమిషాల వీడియో కాల్ కు అనుమతించ్చింది. కానీ వీడియో కాల్ చేసిన సమయంలో ఆమె దాదాపు అపస్మారక స్థితిలో ఉండటంతో కొడుకును గుర్తుపట్టలేకపోయారు. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె.. మెలకువ వచ్చినప్పుడల్లా కొడుకును చూస్తానని అడుగుతోన్నట్లు న్యాయవాది చెబుతున్నారు. కాగా,

గతేడాది అక్టోబర్ లో సిద్దిక్ కప్పన్ అరెస్టు కాగా సుప్రీంకోర్టులో అతని బెయిల్ పిటిషన్ తోపాటు హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఇప్పటికే ఆరు సార్లు విచారణ వాయిదా పడింది. జర్నలిస్ట్ యూనియన్ తరఫున వాదిస్తోన్ కపిల్ సిబాల్.. గత విచారణ సందర్భంలో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి విడుదల ఆదేశాలను ప్రస్తావిస్తూ, రెండు కేసుల్లో వ్యత్యాసాలను గుర్తుచేశారు. అత్యవసరంగా విచారించే హెబియస్ పిటిషన్ విషయంలోనూ ఊరట లభించలేదని లాయర్ మ్యాథ్యూస్ తెలిపారు. చివరి సారి దాఖలైన బెయిల్ పిటిషన్ ను ఆరు వారాలకు, అంటే మార్చి వరకు వాయిదా వేసిన కోర్టు.. తాజాగా కెయుడబ్ల్యుజె దాఖలు చేసిన పిటిషన్ విచారణపై ఇంకా ఎటూ తేల్చలేదు.

English summary
A plea by the Kerala Union of Working Journalists – six days ago – seeking five days’ interim bail for journalist Siddique Kappan so that he can see his seriously ailing mother a final time is yet to be listed for hearing at the Supreme Court. Kappan’s family has said his mother is on her deathbed. In the 122 days that Kerala journalist Siddique Kappan has spent in custody, his habeas corpus petition challenging his arrest and the bail application filed for him have been adjourned by the Supreme Court six times, for periods ranging from four days to six weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X