వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 2 వేల కోట్ల స్కాం, రాజకీయ నాయకుడి కుట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో హడల్ !

|
Google Oneindia TeluguNews

బెళగావి/బెంగళూరు: కర్ణాటకలో ఐఎంఏ స్కాం కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 2,000 కోట్ల స్కాం బయటకు రావడంతో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) పార్టీ నాయకుడు ఈ భారీ స్కాంలో కింగ్ పిన్ అని అధికారుల విచారణలో వెలుగు చూడటంతో కలకలం రేపింది.

తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!

ఎంఇఎస్ పార్టీ లీడర్

ఎంఇఎస్ పార్టీ లీడర్

ఎంఇఎస్ పార్టీ నాయకుడు కిరణ్ ఠాకూర్ కు చెందిన బెళగావిలోని లోకమాన్య మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సోసైటీ కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిందని వెలుగు చూసింది. ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన తరువాత వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని సమాచారం.

60 మంది ఎమ్మెల్యేలు !

60 మంది ఎమ్మెల్యేలు !

శాసన సభ్యుడు అభయ్ పాటిల్ తో పాటు 60 మంది ఎమ్మెల్యేలు, కేంద్ర ఆర్థిక శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి భాదితులు ఫిర్యాదులు చేశారు. కేసు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కో ఆపరేటివ్ సోసైటీ అధికారులకు, సంబంధిత అధికారులకు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికారులు ఎంట్రీ

అధికారులు ఎంట్రీ

ఇప్పటికే బెళగావి జిల్లాలోని చిళకవాడి లోకమాన్య మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సోసైటీ బ్రాంచ్ కు చేరుకున్న అధికారులు అక్కడి రికార్డులు పరిశీలిస్తున్నారు. లోకమాన్య మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సోసైటీలో కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు చెందిన వేలాది మంది ప్రజలు సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా డిపాజిట్లు చేశారని, ఆ నగదును ఎంఇఎస్ నాయకుడు కిరణ్ ఠాకూర్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో విచారణ మొదలైయ్యింది.

ఐఎంఏ స్కాం

ఐఎంఏ స్కాం

బెంగళూరు కేంద్రంగా పని చేసిన ఐఎంఏ జ్యూవెలర్స్ సంస్థ అధినేత మన్సూర్ ఆలీ ఖాన్ వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయడంతో అతనితో పాటు అనేక మందిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారితో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారులను సీబీఐ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఐఎంఏ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

English summary
Karnataka: Another multi-crore fraud case has emerged in the state after the IMA scandal. A MES leader in Belagavi has been accused of embezzling thousands of crores of rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X