• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Scam Saritha: ఆ రోజు ఊపేసింది, ఫైర్ బ్రాండ్ కు 6 ఏళ్లు జైలు శిక్ష, సరితాకు తగదిమ తోమ్!

|

కొచ్చి/ చెన్నై: సోలార్ స్కామ్, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిలువునా ముంచేసింది అని నమోదైన కేసులో హాట్ లేడీ, కేరళ లక్ష్మీ బాంబ్, కేరళ ఫైర్ బ్రాండ్ ఆంటీ సరితా నాయర్ కు 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్షపడింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఓ ఊపు ఊపేసి నానా రచ్చరచ్చ చేసిన సరితా నాయర్ కు ఎట్టకేలకు జైలు శిక్ష పడటంతో ఆమెకు తడిగుడ్డ మిగిలిందని బాధితులు అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కేరళ రాజకీయాలను కుదిపేసి హాట్ టాపిక్ అయిన సరితా నాయర్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Wife: భర్త, ప్రియుడు మందు పార్టీ, బెడ్ రూమ్ లో భార్య ? ఫుల్ బాటిల్ బ్రాందీతో ఫినిష్, కరోనా స్కెచ్ !Wife: భర్త, ప్రియుడు మందు పార్టీ, బెడ్ రూమ్ లో భార్య ? ఫుల్ బాటిల్ బ్రాందీతో ఫినిష్, కరోనా స్కెచ్ !

సరిగమపద సరితా నాయర్

సరిగమపద సరితా నాయర్

కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సరితా నాయర్ ఆ రాష్ట్రంలో రాజకీయంగా చక్రం తిప్పింది. సరితా నాయర్ కు కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు మద్దతు ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అప్పటి కేరళ సీఎం ఉమన్ చాందీ సైతం ఆమె గురించి వివరణ ఇవ్వలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సోలార్ స్కామ్ చిక్కులు

సోలార్ స్కామ్ చిక్కులు

సరితా నాయర్, బిజు రాధాక్రిష్ణన్ తదితరులు కలిసి టీమ్ సోలార్ నిన్యూయేబుల్ ఎనర్జీ సెల్యూషన్ అనే సంస్థను స్థాపించి అక్రమంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నించారని అప్పట్లో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున వివమర్శలు చేశాయి. ఆ సమయంలో కేరళ నుంచి ఢిల్లీ వరకు, భారతదేశం మొత్తం సరితా నాయర్ పేరు మార్మోగిపోయింది.

ఉద్యోగాలు, ఏజెన్సీలు ఇస్తామని?

ఉద్యోగాలు, ఏజెన్సీలు ఇస్తామని?

సొంతంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని నమ్మించిన సరితా నాయర్ అండ్ కో అనేక మందిని మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సోలార్ కంపెనీ ఏజెన్సీలు ఇస్తామని, సోలార్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అనేక మంది దగ్గర సరితా నాయర్ అండ్ టీమ్ అమాయకుల దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.

సరితా మేడమ్ కు సీన్ సిడేల్

సరితా మేడమ్ కు సీన్ సిడేల్

సోలార్ ప్లాంట్ ఏజెన్సీ ఇస్తామని నమ్మించి తన దగ్గర రూ. 42.70 లక్షలు తీసుకున్న సరితా నాయర్, బిజు రాధాక్రిష్ణన్, మణిమోన్ తదితరులు తనను మోసం చేశారని ఆరోపిస్తూ కేరళలోని కోజీకోడ్ కు చెందిన అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సరితా నాయర్ అండ్ టీమ్ మీద కేసు నమోదు అయ్యి పోలీసులు విచారణ చేసి కోర్టులో నివేదిక సమర్పించారు.

6 ఏళ్లు కఠిన జైలు శిక్ష

6 ఏళ్లు కఠిన జైలు శిక్ష

సరితా నాయర్ అండ్ టీమ్ మీద నమోదు అయిన కేసు విచారణ 2018లో మొదలైయ్యింది. అప్పటి నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కే. నిమ్మి సరితా నాయర్, బిజు రాధాక్రిష్ణన్ నేరం చేశారని రుజువు అయ్యిందని అన్నారు. సరితా నాయర్ కు 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మి సంచలన తీర్పు చెప్పారు.

ఆ రోజు ఆడుకున్న సరితా మేడమ్.... ఈ రోజుహాట్ టాపిక్

ఆ రోజు ఆడుకున్న సరితా మేడమ్.... ఈ రోజుహాట్ టాపిక్

కొన్ని ఆనివార్య కారణాల వలన బిజు రాధాక్రిష్ణన్ శిక్షను వాయిదా వేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిమోన్ ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. రాజకీయ పలుకుబడితో అందరినీ ఓ ఆటఆడుకున్న సరితా నాయర్ కు కోర్టు 6 ఏళ్లు జైలు శిక్ష విధించడం ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ అయ్యింది.

ఆ వెబ్ సైట్లలో మేడమ్ ఫోటోలు, వీడియోలు వైరల్

ఆ వెబ్ సైట్లలో మేడమ్ ఫోటోలు, వీడియోలు వైరల్

అప్పట్లోనే సరితా నాయర్ కొందరు రాజకీయ నాయకులతో అశ్లీలంగా మాట్లాడిందని, రహస్యంగా వీడియో కాల్స్ చేసి అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపణలు రావడం, కొన్ని ఫోటోలు, వీడియోలు అసభ్య వెబ్ సైట్లలో దర్శనం ఇవ్వడంతో అవి వైరల్ అయ్యి సరితా నాయర్ విషయం రచ్చరచ్చ అయ్యింది. మొత్తం మీద ఇంతకాలం ఏదో ఒకరకంగా మీడియాలో నానుతున్న సరితా నాయర్ ఇప్పుడు కోర్టు శిక్షతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Scam Saritha: Kerala Solar Scam accused Saritha Nair gets 6 years jail in Cheating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X