బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Scam: ప్రభుత్వ పరీక్షల స్కామ్, స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు, సింపుల్ గా ?, సీసీటీవీ కెమెరాల్లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: ఎస్ఐ పరీక్షల్లో గోల్ మాల్ జరిగిందని, ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల ప్రశ్న పత్రాలు బయటకు తీసుకు వచ్చి జవాబులు పంపించి పరీక్షల్లో పాస్ చేయించి ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పించడానికి కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు వేడివేడిగా ఉన్న సమయంలోనే మరో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో గోల్ మాల్ జరిగిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: భర్త శ్రీరామచంద్రుడు అనుకుంటే శాడిస్టు, భార్య పుట్టింటికి వెళ్లి ఏం చేశాడంటే ?, చివరికి !Illegal affair: భర్త శ్రీరామచంద్రుడు అనుకుంటే శాడిస్టు, భార్య పుట్టింటికి వెళ్లి ఏం చేశాడంటే ?, చివరికి !

కర్ణాటకలో ఎస్ఐ ఉద్యోగాల గోల్ మాల్ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పోలీసు అధికారులు, టీచర్ల మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో జరిగిన కేపీటీసీఎల్ పరీక్షలు రాసిన ఓ యువకుడు స్మార్ట్ వాచ్ ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Scam: Youngman arrested over KPTCL exam scam in Belagavi in Karnataka.

బెళగావి జిల్లాలోని మూడలగి తాలుకాలోని నగనూరు గ్రామంలో నివాసం ఉంటున్న సిద్దప్ప అలియాస్ సిద్దప్ప మదిహళ్ళి (20) అనే యువకుడు ఈనెల 7వ తేదీన ఆదివారం జరిగిన కేపీటీసీఎల్ పరీక్షలను గోకాక్ నగరంలోని ఓ పరీక్షా కేంద్రంలో రాశాడు. ఆ సందర్బంలో సిద్దప్ప స్మార్ట్ ఫోన్ చేతికి కట్టుకుని పరీక్షల ప్రశ్న పత్రం ఫోటోలు తీశాడని అధికారులు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు.

Illegal affair: ఎస్ఐతో భార్య అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య, ఎస్ఐ ఆడియో లీక్, వైరల్ !Illegal affair: ఎస్ఐతో భార్య అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య, ఎస్ఐ ఆడియో లీక్, వైరల్ !

పరీక్షలు రాసిన సిద్దప్ప అక్కడి నుంచి చాకచక్యంగా వెళ్లిపోయాడు. రెండు రోజుల తరువాత సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన అధికారులు సిద్దప్ప పరీక్షా కేంద్రంలో కేపీటీసీఎల్ పరీక్షా పత్రాన్ని స్మార్ట్ ఫోన్ లోని కెమెరాతో ఫోటోలు తీశాడని గుర్తించారు. సిద్దప్పను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న అధికారులు అతని వెనుక ఎవరున్నారు ?, ఎంతమందికి ప్రశ్నపత్రాల ఫోటోలు పంపించాడు ?, ఎక్కడెక్కడ మాస్ కాపీ జరిగింది ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Youngman arrested over kptcl exam scam in Belagavi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X