• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Reverse: పెళ్లికి ముందు భర్త బాహుబలి, తాగుబోతు పెళ్లాం దెబ్బకు గోడ మీద బల్లి, గన్ మ్యాన్స్, పాపం!

|

అహ్మదాబాద్/ గుజరాత్: పెళ్లికి ముందు భర్త బాహుబలిలా ఉన్న భర్త తాగుబోతు భార్య దెబ్బకు గోడ మీద బల్లిలా ఐపోయాడు. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఆ వ్యక్తి హ్యాపిగా జీవితం గడిపాడు. వయసు వచ్చిన తరువాత నుంచి 2018వ సంవత్సరం వరకు అతను పులిలా బతికాడు. అయితే అతని జీవితంలోకి అదే సంవత్సరం మేకలాగా ఎంట్రీ ఇచ్చిన భార్య అతని జీవితాన్ని తారుమారు చేసింది.

వావ్ ఓ ఐడియా జీవితాన్నే మార్చేసింది అనే టీవీ యాడ్ లాగా భర్త జీవితాన్ని సంచనాకించేసింది. తాగుబోతు భార్య పైనుంచి వచ్చి దంచుకొట్టుడుకొట్టడంతో, పప్పు సుద్ద భర్త కింద నలిగిపోయాడు. భార్య దెబ్బతో ఎక్కడెక్కడ పగిలిపోవడంతో భర్త తనకు సెక్యూటీగా గన్ మ్యాన్ లను ఇవ్వాలని పోలీసు అధికారులను ఆశ్రయించాడు.

Sadist husband: బెడ్ రూమ్ లో భార్య ఏం చేసిందో అది A to Z ప్రపంచానికి చూపించిన భర్త!Sadist husband: బెడ్ రూమ్ లో భార్య ఏం చేసిందో అది A to Z ప్రపంచానికి చూపించిన భర్త!

2018 వరకు బాహుబలి

2018 వరకు బాహుబలి

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మునినగర్ లో నివాసం ఉంటున్న రణవీర్ (పేరు మార్చడం జరిగింది) స్నేహితులతో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. తరువాత మంచి ఉద్యోగం రావడంతో సంతోషంగా అతని పని అతను చేసుకుంటూ వచ్చే జీతంతో సంతోషంగా కాలం గడిపేవాడు. 2018 వరకు రణవీర్ బాహుబలిలాగా ఫీలైపోయి బతికిపోయాడు.

బ్రహ్మ బాల్ పెన్ తో తలరాత రాశాడు

బ్రహ్మ బాల్ పెన్ తో తలరాత రాశాడు

2018లో రణవీర్ కుటుంబ సభ్యులు ప్రియాంక (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని చూసి ముచ్చటపడిపోయారు. రణవీర్ కు ప్రియాంక చూడచక్కటి జంట అని పొరపాటు పడి వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన నెల రోజుల వరకు భర్త రణవీర్ తో ప్రియా ప్రియతమా రాగాలు అంటూ ప్రియాంక కాలం గడిపింది. ఆ బ్రహ్మ దేవుడు అందరి జీవితాలను సిరాతో రాస్తే రణవీర్ జీవితాన్ని, అతని అదృష్టాన్నిబాల్ పెన్ బలంగా రాసినట్లు ఉన్నాడు.

ప్రియాంక పచ్చితాగుబోతు

ప్రియాంక పచ్చితాగుబోతు

నెల రోజుల పాటు భర్త రణవీర్ తో సంతోషంగా గడిపిన ప్రియాంక ఓ రోజు భర్త ఇంటికి వచ్చే సరికి రెండు క్వాటర్ల మందు లాగించేసి రూమ్ లో ఉంది. ఇంటికి వెళ్లిన భర్త రణవీర్ పై విరుచుకుపడిన ప్రియాంక అతని రసం పిండేసింది. చేతికి చిక్కిన గరిటెలు, చీపుర్లు, కర్రలు తీసుకుని రణవీర్ ను చితకబాదేసింది .అడ్డువెళ్లిన రణవీర్ తల్లిదండ్రులపై దాడి చేసిన ప్రియాంక భర్త కుటుంబ సభ్యులు అందరికి సినిమా చూపించి.

బాహుబలి కాదు గోడ మీద బల్లి

బాహుబలి కాదు గోడ మీద బల్లి

ప్రియాంక దెబ్బతో రణవీర్ తల్లిదండ్రులు వేరే కాపురం పెట్టారు. కింద ఇంట్లో రణవీర్ తల్లిదండ్రులు నివాసం ఉంటే పైన ఇంట్లో రణవీర్ అతని భార్య ప్రియాంక నివాసం ఉంటున్నారు. రోజు పీకలదాక తాగి భర్త రణవీర్ ను చితకబాదుతున్న ప్రియాంక కొన్ని రోజుల తరువాత షూటింగ్ షెడ్యూల్ ప్లేస్ మార్చింది. రణవీర్ పని చేస్తున్న చోటకు వెళ్లి అతనితో గొడవ పెట్టుకుని అక్కడకూడా అతనికి చిత్రహింసలు పెట్టింది. తన అత్తమామలు తన భార్య ప్రియాంక పచ్చితాగుబోతు అనే విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని రణవీర్ కుంగిపోయాడు. ప్రియాంక దెబ్బకు బాహుబలిలా బతికిన రణవీర్ గోడమీద బల్లిలా అతుక్కుపోయాడు.

భర్త మీద రివర్స్ కేసు

భర్త మీద రివర్స్ కేసు

ఇటీవల రణవీర్ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అప్పటికే భార్య ప్రియాంక దెబ్బతో విసిగిపోయిన రణవీర్ కింద ఇంట్లో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. సాయంత్రం అయితే పీకలదాక మద్యం సేవిస్తున్న ప్రియాంక మేడ దిగివచ్చి భర్త రణవీర్, అతని తల్లిదండ్రులను చితకబాదేసి వారిని చిత్రహింసలకు గురి చేసింది. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకురావాలని తన భర్త రణవీర్, అతని తల్లిదండ్రులు నాకు చిత్రహింసలు పెడుతున్నారని ప్రియాంక పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది.

  Bigg Boss Telugu 4 : YouTuber Mahathalli & Husband Entry ! || Oneindia Telugu
  భార్య దెబ్బకు గన్ మ్యాన్ లు

  భార్య దెబ్బకు గన్ మ్యాన్ లు

  రోజు బ్రాందీ తాగేసి రాత్రి కాంచన సినిమా చూపిస్తున్న ప్రియాంక దెబ్బతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య ప్రియాంక రోజు తాగేసి నన్ను చితకబాదుతోందని, తన తల్లిదండ్రులకు చిత్రహింసలు పెడుతోందని రణవీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కింద ఇంట్లో భయం లేకుండా బతకాలంటే ఇద్దరు పోలీసులను సెక్యూరిటీగా ఇవ్వాలని రణవీర్ మనవి చెయ్యడంతో పోలీసు అధికారులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ప్రియాంక, ఆమె తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద భార్య దెబ్బకు బిత్తరపోయిన రణవీర్ గన్ మ్యాన్ లు (పోలీసులు) కావాలని పోలీసు అధికారులను ఆశ్రయించారని మీడియాలో వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది.

  English summary
  Scene reverse: Husband complaint over alcoholic wife and asked police Protection in Ahmadabad in Gujarat.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X