వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ సీన్ రివర్స్ .. పిల్లలే టీచర్లకు మార్కులు .. మార్కులు తగ్గితే ఆ బెనిఫిట్స్ లేనట్టే

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఒడిశాలో టీచర్లకు మార్కులు వేయనున్న విద్యార్థులు || Students To Give Feedback Of Teachers Performance

సాధారణంగా పాఠశాలలో రాసిన పరీక్షల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను టీచర్లు అంచనా వేస్తారు. కానీ టీచర్ల బోధన విధానం ఎలా ఉంది? ఎలా చెబుతున్నారు ?అన్న దానిఫై ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేకించి శ్రద్ధ పెట్టరు. కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రం టీచర్లు ఎలా చెప్తున్నారు అన్నదానిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల విద్యాబోధన ఆధారంగా వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, జీతాల పెంపు చేయాలనే కొత్త ఆలోచన చేసింది ఒడిశా సర్కార్.

చింతమనేని మరో వివాదం .. పోలీసుల గృహ నిర్బంధం .. రీజన్ ఇదేచింతమనేని మరో వివాదం .. పోలీసుల గృహ నిర్బంధం .. రీజన్ ఇదే

ఒడిశాలో టీచర్లకు ర్యాంకింగ్ ఇవ్వనున్న విద్యార్థులు... సర్కార్ సంచలన నిర్ణయం

ఒడిశాలో టీచర్లకు ర్యాంకింగ్ ఇవ్వనున్న విద్యార్థులు... సర్కార్ సంచలన నిర్ణయం

అందులో భాగంగా విద్యార్థులకు టీచర్లు మార్కులు వేయడం బదులు, టీచర్లకు విద్యార్థులే మార్కులు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ కానుంది.

ఒడిశా రాష్ట్రంలో విద్యార్థులే టీచర్లకు మార్కులు, ర్యాంకులు ఇవ్వనున్నారు. టీచర్ల పనితీరును బట్టి, వారు బోధించే విధానాన్ని బట్టి, విద్యార్థులు టీచర్లకు మార్కులు వేయనున్నారు.టీచర్లకు వచ్చినర్యాంకులను బట్టే వారి జీతాలు పెరగటంఆధారపడి ఉంది. ఈ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది ఒడిశా ప్రభుత్వం.టీచర్లు విద్యార్థులకు చెప్పే పాఠాలను బట్టీ, టీచర్లు వ్యవహరించే తీరు, వారికి అర్థమయ్యేలా చెప్తున్న విధానం వంటి కీలక అంశాలను విద్యార్థులు గమనించిటీచర్లకు మార్కులు ఇస్తారు.

ఇంక్రిమెంట్లు, జీతాల పెంపు విద్యార్థులు రేటింగ్స్ ను బట్టే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం

ఇంక్రిమెంట్లు, జీతాల పెంపు విద్యార్థులు రేటింగ్స్ ను బట్టే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం

ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా, పాఠశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టకుండా , శ్రద్ధగా పాఠాలు చెప్పడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తల్లిదండ్రుల భావిస్తున్నారు.
పిల్లలు మార్కులు వేసే ఈ విధానంలో ప్రతి క్లాస్ పూర్తయిన తర్వాత విద్యార్ధులు తమ టీచర్ల టీచింగ్.. వ్యవహరించే పద్ధతిపై ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. మొత్తం 10 పాయింట్లకు విద్యార్ధులు ఇచ్చే రేటింగ్‌ను బట్టే ఉపాధ్యాయుల పనితీరుపై ప్రభుత్వం ఓ అంచనాకు వస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒడిశా స్కూల్విద్యాశాఖ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక విద్యార్థులు ఇచ్చిన రేటింగ్ లను బట్టిఇంక్రిమెంట్లు, జీతాల పెంపు ఉంటుందని ఒడిశా ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అటు విద్యార్థుల తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది.

 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపరిచే ఆలోచనలో భాగంగానే ఈ నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపరిచే ఆలోచనలో భాగంగానే ఈ నిర్ణయం

ఇక ఇదే విషయాన్ని ఒడిశా విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ తెలిపారు. ఇకపై విద్యార్ధుల నుంచిఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నామని, ప్రతి క్లాస్ రూమ్ లోను దీనికి ఓ రిజిస్టర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. టీచర్లు పిల్లలకు క్లాస్చెప్పటానికి వచ్చిన టైమ్,అయిపోయాక వెళ్లిపోయిన టైమ్ తో పాటు ఆ రోజు టీచర్లు చెప్పిన పాఠాలు.. క్లాస్ లో హాజరైన విద్యార్ధుల సంఖ్య రాయాల్సి ఉంటుందని వివరించారాయన. ప్రతి క్లాస్ తర్వాత విద్యార్ధుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామనీ.. విద్యార్ధులకు ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే అందులో రాయవచ్చునని మంత్రి సమీర్ రంజన్ దాస్ తెలిపారు . తద్వారా ఉపాధ్యాయుల బోధన మెరుగుపడుతుందని, విద్యార్థులకు పాఠాలు చెప్పే విషయంలో శ్రద్ధ వహిస్తారని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఒడిశా సర్కార్ తీసుకున్న నిర్ణయం మిగతా రాష్ట్రాల్లోనూ అవలంబిస్తే ప్రభుత్వ పాఠశాలలలో పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకుంటున్న టీచర్లకు చెక్ పడుతుంది.

English summary
Students will give marks and ranks in Odisha State. Depending on the performance of the teachers and the way they teach, the students will set marks for the teachers. Teachers' ranks depend on their salaries to rise. The Odisha government has embarked on this innovative decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X