• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

92వ పడిలోకి బీజేపీ వ్యవస్థాపకులు అద్వానీ: శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

|

న్యూఢిల్లీ: మాజీ ఉపప్రధాని బీజేపీ కురవృద్ధుడు ఎల్‌కే అద్వానీ 92వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు అద్వానీ నివాసంలో ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ ఎప్పటికీ ప్రజాసేవలోనే ఉన్నారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. విలువలతో కూడిన వ్యక్తి అద్వానీ అని మోడీ ట్వీట్ చేశారు. తనకున్న భావజాలంపై ఏనాడు రాజీపడని వ్యక్తి అద్వానీ అని ప్రధాని కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో అద్వానీ ముందుండేవారని గుర్తుచేసుకున్నారు. ఇక తన పరిపాలనాధక్ష్యతను మోడీ కొనియాడారు.

ద రియల్ లీడర్... మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎల్‌కే అద్వాని

ఇక పార్టీ పరంగా చూసుకుంటే అద్వానీ బీజేపీకి ఒక రూపును తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు ప్రధాని. దేశరాజకీయాల్లో బీజేపీ ఉవ్వెత్తున ఎగిసిందంటే ఇందుకు కారణం అద్వానీనే అని కొనియాడారు ప్రధాని మోడీ. కొన్ని దశాబ్దాలుగా పార్టీకి సేవలందించడం అదేసమయంలో కార్యకర్తలను తీర్చిదిద్దడంలో అద్వానీ కీలకపాత్ర పోషించారని ప్రధాని చెప్పారు.

Scholar,statesman and the most respected leaders:PM on Advanis Birthday

లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న అప్పటి ఉమ్మడి భారత దేశంలోని కరాచీలో జన్మించారు. దేశవిభజన తర్వాత తన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించడంలో అద్వానీ ప్రముఖులు. అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేశారు.అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ప్రచారంలో భాగంగా రథయాత్ర చేపట్టారు. 1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ నేడు భారతదేశ రాజకీయాల్లో ఉన్నతమైన శక్తిగా ఎదిగిందంటే అందుకు అద్వానీనే కారణమని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు ఐదుసార్లు లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. అయితే వయసుమీద పడటంతో ఆయన ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP's grand old man LK Advani celebrated his 92nd Birthday. Vice President Venkaiah Naidu, PM MOdi and HomeMinister Amitshah met Advani at his residence and greeted him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more