వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ స్కూల్ బస్సు ప్రమాదంపై కేసు: ప్రిన్సిపల్, వ్యాన్ డ్రైవర్‌పై హత్యాభియోగాలు నమోదు

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. చిన్నారుల పేరెంట్స్ ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్ (యాజమాని) సహా డ్రైవర్‌పై హత్యాభియోగాలు నమోదుచేశారు. ఇద్దరినీ ఆదివారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. శనివారం సంగ్రూర్‌లో ప్రైవేట్ స్కూల్ బస్సు చిన్నారులను ఇంటికి దింపే సమయంలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నలుగురు చిన్నారులు చనిపోయారు. వారిలో ఒక చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.

పేరెంట్స్ వార్నింగ్..

పేరెంట్స్ వార్నింగ్..

ఇప్పుడే కాదు ఇదివరకు కూడా స్కూల్ ప్రిన్సిపాల్ లఖ్విందర్, డ్రైవర్ దల్బీర్‌ను పేరెంట్స్ హెచ్చరించారని డీఎస్పీ సుఖ్ బిందర్ పేర్కొన్నారు. గతంలో ఆటో ఉండేదని.. దాంతో ఎప్పుడూ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన ఉండేదని గుర్తుచేశారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు వ్యాన్ సమకూర్చారని.. అదీ పాతది కావడంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత ఎక్కువైందన్నారు.

సోమవారం సర్టిఫికేట్..

సోమవారం సర్టిఫికేట్..


వ్యాన్ ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆర్టీఏ నుంచి ధ‌‌ృవపత్రాలను కోరామని, సోమవారం నివేదిక వస్తోందని.. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్, ప్రిన్సిపాల్‌పై హత్యాయత్నం కింద కేసులు కూడా నమోదు చేశారు.

రూ.లక్ష సాయం..

రూ.లక్ష సాయం..


బస్సు ప్రమాదంలో చనిపోయిన చిన్నారుల ఒక్క కుటుంబానికి శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ రూ. లక్ష ఆర్థికసాయం అందజేస్తామని పేర్కొన్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్జీపీసీ చీఫ్ గోబింద్ సింగ్ డిమాండ్ చేశారు.

1990 మోడల్ వ్యాన్

1990 మోడల్ వ్యాన్


ప్రమాదానికి గురైన బస్సు గురించి కఠోర నిజాలు వెలుగుచూస్తున్నాయి. 1990 మోడల్‌కి చెందిన వ్యాన్.. ఎల్పీజీ సిలిండర్‌తో నడుస్తోందని చెప్పారు. స్కూల్ వ్యాన్‌లో మంటలు చెలరేగిన సమయంలో అందులో12 మంది ఉన్నారు. సమీపంలో గల పొలంలో పనిచేస్తున్న వారు వచ్చి మిగతావారిని కాపాడారు. కానీ అప్పటికే నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.

English summary
Punjab Sangrur police slapped murder charges against the driver and the owner-cum-principal of the school to which the vehicle belonged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X